Monday, April 29, 2024

హైందవ సనాతన ధర్మాన్ని గుర్తుచేసిన ‘అఖండ’

- Advertisement -
- Advertisement -

Akhanda Movie 100 days Celebrations

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ’ చిత్రం 20 థియేటర్లలో వంద రోజులు పూర్తి చేసుకుంది. డిసెంబర్ 2న విడుదలై కరోనా సమయంలోనూ ఊహించని విజయాన్ని సాధించడం బాలకృష్ణలోని ప్రత్యేకతగా అభిమానులు తెలియజేస్తున్నారు. అందుకే వందరోజుల వేడుకను కర్నూలులో నిర్వహించింది చిత్ర యూని ట్. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ, ‘ఈ అఖండ సినిమా మన హైoదవ సనాతన ధర్మాన్ని మరోసారి గుర్తుచేసేట్లుగా వుంది.

ప్రకృతి, ధర్మం, ఆడవారి జోలికి వచ్చి ఎటువంటి అపాయం కలిగించినా భగవంతుడు ఏదో రూపంలో మనిషిలో ప్రవేశించి అవధూతగా మారతాడు. ఆ పాత్ర వేయించి నా ద్వారా దర్శకుడు మంచి సందేశం ఇచ్చాడు. అఖండ సినిమాను మన తెలుగువారేకాదు ప్రపంచంలోని అందరూ వేయినోళ్ళతో పొగిడారు. దర్శకుడు బోయపాటి శ్రీను, నేను కథ మూలాల్లోకి వెళ్ళి మంచి సినిమాలు చేయాలనే తపనతో కృషి చేస్తుంటాము’ అని అన్నారు. దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ, ‘మాస్ కమర్షియల్ సినిమాలో ప్రకృతి, దైవం, ధర్మం గురించి చెప్పడం చాలా అరుదు. అందుకు అవకాశం కల్పించిన భగవంతుడికి తలవంచి నమస్కరిస్తున్నా. మాస్ కమర్షియల్ సినిమా ఏదైనా చెయ్యాలంటే ప్లే గ్రౌండ్ రాయలసీమే.

రాయలసీమ మెచ్చితే ప్రపంచమే మెచ్చుతుంది. అందుకే బాలయ్య ఈ వేడుకను ఇక్కడే చేయాలని అన్నారు. బాలయ్య పురా ణ పురుషుడు. నటనలో నందమూరి తారక రామారావు వారసుడేకాకుండా సేవా కార్యక్రమంలోనూ ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నాడు’ అని తెలిపారు. నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, ఈ పాండమిక్ సమయంలో ‘అఖండ’ వంద రోజులు ఆడడం గొప్ప విషయం. ఈ మధ్య పాన్ ఇండియా కలెక్షన్లు చూసుకుంటే అఖండ, పుష్పకు వచ్చినట్లు ఏ సినిమాకూ రాలేదు. బాలయ్యబాబు అభిమానులు మీసం మెలేసి, తొడకొట్టే సినిమా మరొకటి చేయాలని అనుకుంటున్నానను అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజ్ఞ జైశ్వాల్, శ్రీకాంత్, పూర్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News