Monday, April 29, 2024

ప్రతికూల వాతావరణం కారణంగా అమర్‌నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత

- Advertisement -
- Advertisement -

Amarnath Yatra Cancelled Due to bad weather

న్యూఢిల్లీ: జూన్ 30న ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్ర మంగళవారం ఉదయం ప్రతికూల వాతావరణం కారణంగా పహల్గామ్ మార్గంలో తాత్కాలికంగా నిలిపివేయబడింది. పహల్గామ్‌లోని నున్వాన్ బేస్ క్యాంప్ నుండి సహజంగా ఏర్పడిన మంచు-శివలింగం ఉన్న గుహ మందిరం వైపు యాత్రికులు వెళ్లడానికి అనుమతించబోమని అధికారులు తెలిపారు. దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లోని పహల్గామ్‌లోని నున్వాన్ , సెంట్రల్ కాశ్మీర్‌లోని గందర్‌బల్ జిల్లాలో బల్తాల్ క్యాంప్‌లోని జంట బేస్ క్యాంప్‌ల నుండి వార్షిక 43-రోజుల తీర్థయాత్ర నిర్వహించబడుతుంది.

మంగళవారం ఉదయం, 6,300 మందికి పైగా అమర్‌నాథ్ యాత్రికుల ఆరవ బ్యాచ్ మంగళవారం దక్షిణ కాశ్మీర్‌లోని 3,880 మీటర్ల ఎత్తైన అమర్‌నాథ్ గుహ పుణ్యక్షేత్రానికి బయలుదేరిందని అధికారులు తెలిపారు. సిఆర్‌పిఎఫ్ భారీ భద్రత మధ్య 239 వాహనాల కాన్వాయ్‌లో మొత్తం 6,351 మంది యాత్రికులు ఇక్కడి భగవతి నగర్ యాత్రి నివాస్ నుండి బయలుదేరినట్లు అధికారులు తెలిపారు.  వీరిలో 4,864 మంది పురుషులు, 1,284 మంది మహిళలు, 56 మంది పిల్లలు, 127 మంది సాధువులు, 19 మంది సాధ్విలు, ఒక ట్రాన్స్‌జెండర్ ఉన్నట్లు వారు తెలిపారు. బల్తాల్ బేస్ క్యాంప్‌కు వెళ్లే 2,028 మంది యాత్రికులు తెల్లవారుజామున 3.35 గంటలకు 88 వాహనాల్లో మొదట బయలుదేరారని, తరువాత 151 వాహనాలతో కూడిన రెండవ కాన్వాయ్ 4,323 మంది యాత్రికులను కాశ్మీర్‌లోని పహల్గామ్ క్యాంపుకు తీసుకువెళ్లిందని వారు తెలిపారు.

పహల్గామ్‌లోని నున్వాన్ బేస్ క్యాంప్ నుండి సహజంగా ఏర్పడిన మంచు-శివలింగం ఉన్న గుహ మందిరం వైపు యాత్రికులు వెళ్లడానికి అనుమతించబడరని వారు తెలిపారు.

పవిత్ర గుహకు యాత్ర రెండు బేస్ క్యాంపుల నుండి ప్రారంభమైంది – అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గామ్‌లోని నున్వాన్ క్యాంప్ ,  గందర్‌బల్ జిల్లాలోని బల్తాల్ క్యాంప్.మొదటి బ్యాచ్ యాత్రికులు గత గురువారం పహల్గామ్ బేస్ క్యాంపుకు చేరుకున్నారు.

నేటి వరకు 72,000 మంది యాత్రికులు గుహ మందిరంలో తమ ప్రార్థనలు ముంగించారని, సహజంగా ఏర్పడిన మంచు-శివలింగాన్ని దర్శించారని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News