Monday, April 29, 2024

నేడు అపెక్స్ కౌన్సిల్ భేటీ

- Advertisement -
- Advertisement -

Apex Council meeting today

 

గోదావరి, కృష్ణా నీటివాటాలపై పట్టుపట్టనున్న తెలంగాణ n పోతిరెడ్డిపాడును నిలిపేయాలని, పోలవరం నుంచి 45 టిఎంసిల నీరివ్వాలని డిమాండ్ n మధ్యాహ్నం ఒంటి గంటకు వీడియో కాన్ఫరెన్స్ n ప్రగతిభవన్ నుంచి పాల్గొననున్న సిఎం కెసిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్ర పాలకులు దశాబ్దాల తరబడి చేస్తున్న జలదోపిడిని నిలదీస్తూ , తెలంగాణ నీటివాటాలను తేల్చాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో వాదించేందుకు తెలంగాణ ప్రభుత్వం సంసిద్ధమైంది. నీటిలెక్కలతో నివేదికలు రూపొందించి నీటి వాటాలు తేల్చాని కేంద్రాన్ని, సత్యఆరోపణలు చేస్తూ తెలంగాణ జలవనరులకు గండి కొడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుతాన్ని నోరు మూయించే విధంగా అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో వాదనలు విపించేందుకు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ సిద్ధమయ్యారు. మంగళవారం కేంద్ర జవనరుల శాఖ మంత్రి గంజేంద్రసింగ్ షెకావత్ నిర్వహించే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వాదనలు వినిపించనున్నారు.

ఇప్పటి కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయాలు, ఆంధ్ర చేస్తున్న అసత్య ఆరోపణకు సంబంధించిన వివరాలను కేంద్రానికి పంపించిన ముఖ్యమంత్రి కెసిఆర్ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో మొదట కేంద్రాన్ని నిలదీయ నున్నారు. గొంతు ఎండిపోయిన తెలంగాణ నీటి ప్రయోజనాలను ఎజెండాగా చేసుకుని ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించుకున్నప్పటికీ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి మాత్రం నీటివాటాల కేటాయింపుల్లో చేస్తున్న నిర్లక్షవైఖరికి నిదర్శనంగా ఆంధ్ర, తెలంగాణలో నీటివాటాల సమస్యలు పరిష్కారం కాలేదనే వాదనతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు వస్తోంది. ప్రదానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం 2014 జూన్14న అంతర్ రాష్ట్రాల జలవివాదాల చట్టం 1956 సెక్షన్ 3 మేరకు నీటి వాటాలు తేల్చాలని ప్రధాని మోడీకి లేఖ రాస్తే ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదనే అంశాన్ని ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని ప్రశ్నించ నుంది. కేంద్రం పరిధిలోని అంశాలను పరిష్కారం చేయకుండా, రాష్ట్రాల జల వనరుల పంపకాలకు ప్రత్యేక ట్రిబ్యూనల్ ఏర్పాటు చేయకుండా అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి మధ్యవర్తిత్వం వహిస్తామని ఏడేళ్ల అనంతరం కేంద్రం చెప్పడాన్ని ఈ సమావేశంలో నిలదీయనున్నారు.

గోదావరి నీరు సముద్రం పాలుకాకుండా 1950 టిఎంసిలు వాడుకునే హక్కు

గోదావరి నీటివాటాల్లో తెలంగాణ 967.94 టిఎంసిలు వాడుకునే హక్కు ఉంది. అలాగే సముద్రంలో కలిసే నీటి నుంచి 1950 టిఎంసి నీటిని వాడుకోవడంతో పాటుగా మిగులు జలాలపై రాష్ట్రానికి ఉన్నహక్కును ఈ సమావేశంలో వివరిస్తారు. కృష్టాబేసిన్‌లో అవసరానికి తగిన నీరు ఉన్నప్పటికీ కృష్ణాబేసిన్ అవతల ఆంధ్ర నీటిని వినియోగించడానికి కడుతున్న ప్రాజెక్టులు తెలంగాణకు నష్టం కలిగిస్తాయి. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యూలేటర్ సామర్ధం పెంచుతూ ఆంధ్ర తలపెట్టిన ప్రాజెక్టును నిలిపి వేయాలి. ఈ ప్రాజెక్టు ద్వారా రోజుకు 80వేల క్యూసెక్కుల నీరును తరలిస్తే కృష్ణాపరివాహక ప్రాంతాల్లోని ప్రాజెక్టులకు నీటి లభ్యత ప్రశ్నార్థకమవుతుంది.

తక్షణం పోతిరెడ్డి పాడు ప్రాజెక్టును ఆపివేయాలని అపెక్స్ కౌన్సిల్లో తెలంగాణ డిమాండ్ చేయనుంది. అలాగే ఆంధ్ర చేసిన ఆరోపణలను తిప్పికొడుతూ ప్రాజెక్టుల డిపిఆర్‌లను అపెక్స్ కౌన్సిల్ ముందు తెలంగాణ ప్రభుత్వం ఉంచేందుకు సిద్ధమైంది. ఆంధ్ర ఆరోపణలను తిప్పికొడుతూ సబ్ బెసిన్లు మంజీర, ఎగువ గోదావరి, మధ్య గోదావరి, మానేరు, పెన్‌గంగా, వార్దా, ప్రాణహిత, ఇంద్రావి శబరి నదుల నీటివాటాలు, గోదావరి నదీ జలాల వినియోగంపై మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలతో చేసుకున్న ఒప్పంద పత్రాలను అపెక్స్ కౌన్సిల్ ముందుకు తీసుకు వచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం రికార్డులను సిద్ధం చేసింది.

శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ తెలంగాణకు అప్పగించాలి

కృష్ణానదీ యాజమాన్యబోర్డు నిర్లక్షంగా వ్యహరించడంతో ఆంధ్ర శ్రీశైళం ప్రాజెక్టు నీటికి గండికొట్టుతుందని సాగునీటి అధికారులు చెప్పారు. తెలంగాణలోనే కృష్ణా పరివాహక ప్రాంతం అత్యధికంగా ఉంది. తెలంగాణ మీదుగానే శ్రీశైలంలోకి కృష్ణానదీ జలాలు వెళ్లుతున్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటంతో శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలు తెలంగాణకు అప్పగిస్తే ట్రిబ్యునల్ తీర్పులకు, అవార్డులకు అనుగుణంగా పారదర్శంకంగా నిర్వహించేందుకు అవకాశం కల్పించాలని అపెక్స్ కౌన్సిల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రధానంగా డిమాండ్ చేయనుంది. మహారాష్ట్రతో ఒప్పందాలు చేసుకుని పాత ప్రాజెక్టులకు రీడిజన్ చేసి కాళేశ్వరం నిర్మిస్తే ప్రజల దృష్టి మరల్చేందుకు అసత్య ప్రచారం చేస్తూ పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆంధ్ర చేపట్టిందనే విషయాన్ని ఈ సమావేశంలో స్పష్టం చేయనున్నారు.

పోలవరం నుంచి వాటా

పోలవరం జాతీయ ప్రాజెక్టు ప్రారంభించినప్పటి నుంచి నీటివాటాలను గోదావరి ట్రిబ్యూనల్ ప్రకటించింది. పోలావరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి కృష్ణాకు తరలించిన నీటిలో ఎపికి 45, కర్ణాటకకు 21, మహారాష్ట్రకు 14 టిఎంసిలవాటా ఉంది. అయితే ఈ నీటిని ట్రిబ్యునల్ నాగార్జున సాగర్ ఎగువకు కేటాయించింది. నాగార్జున సాగర్ ఎగువ తెలంగాణలో ఉండటంతో 45 టిఎంసిలపై తెలంగాణకు హక్కు ఏర్పడింది. అయితే మహారాష్ట్ర, కర్ణాటక ఈ నీటిని నివినియోగిస్తుంది. ఇప్పటివరకు ఆంధ్ర ప్రదేశ్ ఈ నీటిని తెలంగాణకు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో పోలవరం వాటాపై అపెక్స్ కౌన్సిల్‌లో తెలంగాణ పట్టుబట్ట నుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News