Monday, April 29, 2024

క్రీడా పాఠశాల ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ

- Advertisement -
- Advertisement -

Applications for Sports School Admissions

త్వరలో నూతన క్రీడా విధానం అమలుల్లోకి తెస్తాం: మంత్రి శ్రీనివాస్‌గౌడ్

మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి నూతన విధానాన్ని రూపొందిస్తున్నామని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఆదివారం మంత్రి కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర క్రీడల పాఠశాల హాకీంపేట్, కరీంనగర్, ఆదిలాబాద్‌లోని క్రీడా పాఠశాలలోని 4వ, 5వ తరగతులకు అడ్మిషన్లు కోసం ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకు నోటిఫికేషన్‌ను ఆయన విడుదల చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి, దేశానికి వన్నె తెచ్చే క్రీడాకారులను తయారు చేసే క్రీడా కర్మాగారంగా క్రీడా పాఠశాలలను తయారు చేస్తున్నామన్నారు.

త్వరలో క్రీడా పాలసీ డ్రాఫ్ట్‌ను క్యాబినెట్‌లో ఆమోదం చేసుకొని దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీని అమలు చేయబోతున్నామన్నారు. క్రీడాకారులను, కోచ్ లకు ఈ పాలసీలో ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఉన్న క్రీడా పాఠశాలలో గత విద్యా సంవత్సరం కోవిడ్ 19 కారణంగా 2021-22 విద్యాసంవత్సరంలో 4వ తరగతి అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల చేయలేదన్నారు.ఈ విద్యా సంవత్సరంను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో ఉన్న క్రీడా పాఠశాలలు హాకీంపేట్, కరీంనగర్, ఆదిలాబాద్‌లో 4వ, 5వ తరగతులలో 15 క్రీడా విభాగాలలో మొత్తం 240 సీట్లను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ను విడుదల చేశామని మంత్రి వెల్లడించారు.

* హాకీంపేట్‌లోని 4వ తరగతిలో బాలురుకు ఉన్న 20 సీట్లు, బాలికలకు ఉన్న 20 సీట్లు,5వ తరగతిలో బాలురుకు ఉన్న 20 సీట్లు, బాలికలకు ఉన్న 20 సీట్లు మొత్తం 80 సీట్లును భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ను విడుదల చేశామన్నారు.

* కరీంనగర్‌లోని 4వ తరగతిలో బాలురుకు ఉన్న 20 సీట్లు, బాలికలకు ఉన్న 20సీట్లు, 5వ తరగతిలో బాలురుకు ఉన్న 20 సీట్లు, బాలికలకు ఉన్న 20 సీట్లు మొత్తం 80 సీట్లు ను భర్తీ చేసేందుకు షెడ్యూల్ విడుదల చేశామన్నారు.

* ఆదిలాబాద్ క్రీడా పాఠశాలలో 4వ తరగతిలో బాలురుకు ఉన్న 20 సీట్లు, బాలికలకు ఉన్న 20 సీట్లు, 5వ తరగతిలో బాలురుకు ఉన్న 20 సీట్లు, బాలికలకు ఉన్న 20 సీట్లు మొత్తం 80 సీట్లును భర్తీ చేసేందుకు అడ్మిషన్లు కోసం ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకు ప్రకటన విడుదల చేశామన్నారు. అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి కోరారు. రాష్ట్రంలో ఉన్న అన్ని క్రీడా పాఠశాల లో అడ్మిషన్లు పారదర్శకంగా జరపాలని క్రీడా శాఖాధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో క్రీడా శాఖ డిప్యూటీ డైరెక్టర్ సుజాత, క్రీడా పాఠశాల ఓఎస్‌డి డాక్టర్ హరికృష్ణ పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News