Wednesday, May 8, 2024

కరోనాతో ఎఎస్ఐ మృతి

- Advertisement -
- Advertisement -

Corona

 

ముంబయి: మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో ఎఎస్‌ఐ (50) కరోనా వైరస్‌తో మృతి చెందాడు.  సదరు ఎఎస్ఐతో పని చేసిన వారిని క్వారంటైన్ కు తరలించారు. ఎఎస్ఐ లో కరోనా లక్షణాలు కనిపించగానే ఆస్పత్రిలో కరోనా టెస్టు చేస్తే పాజిటివ్ రావడంతో ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సదరు ఎఎస్‌ఐకి వయసు ఎక్కువగా ఉండడంతో పాటు హైబిపితో పాటు ఒబెసిటి ఉంది. ఐసియులో చికిత్స పొందుతూ గురువారం ఉదయం ఎఎస్‌ఐ మృతి చెందాడు. మహారాష్ట్రలో గతంలో ఐదుగురు పోలీసులు కరోనా వైరస్‌తో మృతి చెందారు. రెండు రోజుల క్రితం పుణేలోని జెజె మార్గ్ పోలీస్ స్టేషన్ లో డిసిపితో పాటు మరో 12 మంది కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. చాప కింద నీరులా ముంబయిని కరోనా వణికిస్తోంది. ఒక్క మహారాష్ట్రలో కరోనా వైరస్ 16,758 మందికి సోకగా 651 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం ఇండియా కరోనా బాధితుల సంఖ్య 53,045కు చేరుకోగా 1787 మంది చనిపోయారు. తెలంగాణలో కరోనా వైరస్ 1107 మందికి వ్యాపించగా 29 మంది మృతి చెందారు. ఇండియాలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 15,331గా ఉంది. ప్రపంచంలో కరోనా వైరస్ 38.21 లక్షల మందికి వ్యాపించగా 2.65 లక్షల మంది బలయ్యారు. వరల్డ్ లో కరోనా నుంచి ఇప్పటి వరకు 13 లక్షల మంది కోలుకున్నారు.

రాష్ట్రాల వారిగా కరోనా వివరాలు:

రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు
బాధితులు సంఖ్య చికిత్స పొందుతున్నవారు కోలుకున్నవారు మృతులు
మహారాష్ట్ర
16,758 13,013 3,094 651
గుజరాత్
6,625 4,729 1,500 396
ఢిల్లీ
5,532 3,925 1,542 65
తమిళనాడు
4,829 3,278 1,516 35
రాజస్థాన్ 3,355 1,521 1,739 95
మధ్య ప్రదేశ్
3,138 1,854 1,099 185
ఉత్తర ప్రదేశ్
2,998 1,808 1,130 60
ఆంధ్రప్రదేశ్
1,777 1,012 729 36
పంజాబ్ 1,526 1,364 135 27
పశ్చిమ బెంగాల్ 1,456 1,047 265 144
తెలంగాణ 1,107 430 648 29
జమ్ము కశ్మీర్
775 445 322 8
కర్నాటక
693 309 354 29
హర్యానా 594 327 260 7
బిహార్
542 350 188 4
కేరళ 503 30 469 4
ఒడిశా 205 142 61 2
ఝార్ఖండ్ 127 87 37 3
ఛండీగఢ్
124 102 21 1
త్రిపుర
64 62 2 0
ఉత్తరాఖండ్ 61 21 39 1
ఛత్తీస్ గఢ్
59 23 36 0
అస్సాం 46 10 35 1
హిమాచల్ ప్రదేశ్
43 3 34 3
లడఖ్
42 25 17 0
అండమాన్ నికోబార్ దీవులు
33 1 32 0
మేఘాలయ 12 1 10 1
పుదుచ్చేరీ 9 3 6 0
గోవా
7 0 7 0
మణిపూర్ 2 0 2 0
మిజోరం
1 0 1 0
అరుణాచల్ ప్రదేశ్ 1 0 1 0
దాద్రా నగర్ హవేలీ డామన్ డయ్యూ
1 1 0 0
మొత్తం
53,045 35,923 15,331 1,787

దేశాల వారిగా కరోనా బాధితులు సంఖ్య

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News