Monday, April 29, 2024

అచ్చెన్న ఖైదీ నంబర్ 1573

- Advertisement -
- Advertisement -

Authorities allotted number 1573 to Atchannaidu

శ్కాంలో మరికొందరి అరెస్ట్‌కు రంగం సిద్ధం

హైదరాబాద్ : ఇఎస్‌ఐ శ్కాంలో అరెస్ట్ అయిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి జైలు అధికారులు ఖైదీ నంబర్ 1573 కేటాయించారు. విజయవాడ జైలులో ఉన్న అచ్చెన్నను న్యాయమూర్తి ఆదేశాల మేరకు వైద్య సేవల నమిత్తం గుంటూరు జిజిహెచ్ తరలించారు. ఈక్రమంలో ఇటీవల సర్జరీ చేయించుకున్న అచ్చెన్నకు ఆస్పత్రిలో వైద్య సేవలు అందిస్తున్నారు. ఇదే కేసులో అచ్చెన్నాయుడితో పాటు మరో నలుగురు నిందితులను ఎసిబి అధికారులు విచారించిన అనంతరం వారిని ఎసిబి కోర్టులో ప్రవేశపెట్టంతో వారికి కోర్టు 14 రోజుల రిమాండ్‌కు తరలించారు. ఈ కుంభకోణంలో 19 మంది ప్రమేయం ఉన్నట్టు గుర్తించిన ఎసిబి అధికారులు వారిని అదుపులోకి తీసుకునే యత్రంలో ఉన్నారు.

కాగా నిందితులలో కొందరు సచివాలయ ఉద్యోగులు ఉన్నట్లు ఎసిబి వర్గాలు వివరిస్తున్నాయి. కాగా ఎపి ఇఎస్‌ఐ శ్కాం విచారణ కోసం తెలంగాణ రాష్ట్రానికి ఎసిబి బృందాలను పంపనున్నారు. శ్కాంలో లబ్ది దారులుగా ఉన్న సంస్థల యజమానులను ఎసిబి అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. నిలకడగా అచ్చెన్న ఆరోగ్యం ః ఇఎస్‌ఐ శ్కాంలో కీలక నిందితుడు అచ్చెన్న ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని జిజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ సుధాకర్ స్పష్టం చేశారు. రెండు లేదా మూడు రోజుల్లో గాయం నయమయ్యే అవకాశం ఉందని తెలిపారు. “ఎక్కువసేపు ప్రయాణం వల్ల గాయం కాస్త పెరిగింది.

ఈక్రమంలో 90శాతం మేరకు మళ్లీ ఆపరేషన్‌అవసరం లేదని, సర్జరీ జరిగిన ప్రాంతంలో నొప్పి తగ్గడానికి రెండు, మూడు రోజులు పడుతుందన్నారు. ఏడుకు చేరుకున్న అరెస్టులు ః ఇఎస్‌ఐ స్కాంలో మరొకరిని శనివారం నాడు ఎసిబి అధికారులు జాయింట్ డైరెక్టర్ గోవర్థన్‌ను అరెస్ట్ చేశారు. దీంతో ఇఎస్‌ఐ స్కాంలో అరెస్టుల పర్వం ఏడుకు చేరుకుంది. ఇఎస్‌ఐ స్కాంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు విచారణను వేగవంతం చేశారు. ఈ క్రమంలో ఇందులో కొందరు సచివాలయ ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు తాజాగా గుర్తించారు అధికారులు.

ఈ నేపథ్యంలో వారిని విచారించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ కేసులో మొత్తం 19 మంది ముద్దాయిలను గుర్తించినట్లు ఎసిబి జెడి రవికుమార్ వెల్లడించారు. మాజీ ఎంఎల్‌ఎ చింతమనేని అరెస్ట్ ః ఇఎస్‌ఐ శ్కాంలో అరెస్ట్ అయిన అచ్చెంనాయుడికి మద్ధతు గా ఏలూరు కలపర్రు టోల్ గేట్ వద్ధ ధర్నా చేసేందుకు వెళుతున్న దెందులూరు మాజీ శాసనసభ సభ్యులు చింతమనేని ప్రభాకర్‌ను అరెస్ట్ చేశారు. కోవిడ్ లాక్ డౌన్ నిబంధనలు ప్రకారం డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ 2005 సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసి మేజిస్ట్రేట్ ముందు చింతమనేనిని హజరుపరుచగా 14 రోజులు రిమాండ్ విధించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News