Sunday, April 28, 2024

చెరువులో దూకి బి పార్మసీ విద్యార్ధి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

కీసరః ఆర్మీలో ఉద్యోగానికి తల్లిదండ్రులు అడ్డు చెప్పడంతో మనస్థాపం చెందిన బి ఫార్మసీ విద్యార్ధి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన బుధవారం కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని చీర్యాల్ గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతానికి చెందిన అక్షయ్ (23) చీర్యాల్‌లోని గీతాంజలి కళాశాలలో బి ఫార్మసీ మూడో సంవత్సరం చదువుతూ స్నేహితులతో కలిసి చీర్యాల్ గ్రామంలో అద్దె గధిలో నివాసం ఉంటున్నాడు. అక్షయ్ ఆర్మీలో ఉద్యోగానికి ఎంపిక కాగా ఇందుకు తల్లిదండ్రులు అడ్డు చెప్పారు. దీంతో గత కొంత కాలంగా మనస్థాపంతో ఉన్న అక్షయ్ మంగళవారం రాత్రి జరిగిన కళాశాల వార్షికోత్సవ వేడుకలలో స్నేహితులతో కలిసి పాల్గొన్నాడు.

బుధవారం తెల్లవారు జామున వాట్సప్ స్టేటస్ ద్వారా తన చావుకి ఎవరు కారణం కాదంటూ సూసైట్ నోట్ పెట్టి చీర్యాల్ గ్రామ శివారులోని నాటికం చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చెరువు వద్ద అక్షయ్ సెల్ ఫోన్, చెప్పులు గుర్తించిన స్నేహితులు పోలీసులకు సమాచారం అందజేశారు. గంటల తరబడి బోటులో డీఆర్‌ఎఫ్, రెస్కూ టీమ్‌లతో చెరువులో తీవ్రంగా గాలింపు చేపట్టిన పోలీసులు మధ్యాహ్నం అక్షయ్ మృతదేహాన్ని వెలికి తీశారు. నాందేడ్‌లో ఉన్న అక్షయ్ తండ్రి వినోద్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందజేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించిన కీసర పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News