Sunday, April 28, 2024

అమెరికా సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా బారెట్ ప్రమాణస్వీకారం

- Advertisement -
- Advertisement -

Barrett was sworn in as a U.S. Supreme Court judge

 

వాషింగ్టన్ : అమెరికా సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఎమీకోనీబారెట్ సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. రిపబ్లికన్ నియంత్రణలో ఉన్న సెనేట్ ఈ వివాదాస్పద నియామకాన్ని నిర్ధారించిన గంట తరువాత ఈ ప్రమాణ స్వీకారం జరిగింది. అధ్యక్ష ఎన్నికలు ఇంకా వారం రోజులు ఉండగా ఈ నియామకం జరగడం ట్రంప్ వర్గానికి సానుకూల అంశంగా భావిస్తున్నారు. రెండు వర్గాలుగా చీలిన సెనేట్ 5248 ఓట్ల తేడాతో భావి తరాలకు కన్సర్వేటివ్ మార్గదర్శకత్వం సూచించేలా 115 వ న్యాయమూర్తిని సోమవారం ఎన్నుకుంది. 48 ఏళ్ల మతసంప్రదాయ కన్సర్వేటివ్ చే జస్టిస్ బారెట్‌చే సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ క్లారెన్స్ థామస్ శ్వేత సౌథంలో ట్రంప్ సమక్షంలో రాజ్యాంగ పరమైన ప్రమాణం చేయించారు. న్యాయమూర్తిగా ఎన్నిక కావడం ఎంతో గౌరవంగా, గర్వంగా భావిస్తున్నానని ఆమె అన్నారు. అమెరికా చరిత్రలో ఇదో చిరస్మరణీయమైన రోజుగా అధ్యక్షుడు ట్రంప్ అభివర్ణించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News