Monday, April 29, 2024

లండన్ బ్రిడ్జి దగ్గర బతుకమ్మ వేడుకలు

- Advertisement -
- Advertisement -

Bathukamma celebrations near London Bridge

 

కోవిడ్ నిబంధనలతో బృందాలుగా వేడుకల్లో పాల్గొన్న మహిళలు

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన బతుకమ్మ ఉత్సవాలను తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్‌డమ్(టాక్) ఆధ్వర్యంలో కోవిడ్19 నిబంధనలు పాటిస్తూ నిర్వహించారు. ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత స్ఫూర్తితో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ చారిత్రాత్మక లండన్ టవర్ బ్రిడ్జ్ దగ్గర బుతకమ్మ పండుగ నిర్వహించారు. ప్రతి సంవత్సంరం వందల మంది మహిళలలో ఆనందంగా బతుకమ్మ వేడుకలను జరుపుకుంటామని టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం తెలిపారు. ఇది సంబురాలకు సమయం కాకపోయినప్పటికీ మనసంస్కృతి సంప్రదాయాలను మరువకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు.

లండన్ టవర్ బ్రిడ్జిదగ్గర వాతావరణం అనుకూలించక పోయినా బతుకమ్మలను పేర్చి ఆటలాడి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలను అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. స్థానిక కోవడ్ నిబంధనల తో టాక్ కార్యవర్గ సభ్యులంతా వివిధ గ్రూపులుగా ఆరుగురికి మించకుండా బతుకమ్మ వేడుకలను జరుపుకున్నామని, కొంతమంది ఇంటికే పరిమితమై బతుకమ్మ పండుగ జరపుకున్నారని, మన సంస్కృతిని మరిచి పోకుండా ఎలాంటి పరిస్థితులున్నా పపంచవ్యాప్తంగా బతుకమ్మ ఆడిన ప్రతి ఆడబిడ్డకు టాక్ అధ్యక్షురాలు పవిత్ర రెడ్డి కంది కృతజ్ఞతలు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News