Sunday, April 28, 2024

మరో రెండు బిగ్ ఆఫర్లు

- Advertisement -
- Advertisement -

రష్మిక మందన్న ఛలో, గీతా గోవిందం వంటి హిట్ సినిమాలతో తక్కువ కాలంలోనే స్టార్ స్టేటస్ సంపాదించింది. ఆ తరువాత మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత చేసిన ‘భీష్మ’ కూడా మంచి హిట్టవ్వడంతో ఆమె లక్కీ హీరోయిన్ అనిపించుకుంది. దీనికి తోడు రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘పుష్ప’ చిత్రంలో కథానాయకిగా నటిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమెకు ఇంకో రెండు మంచి ఆఫర్లు వచ్చాయని తెలిసింది. ఆ రెండు ఆఫర్స్‌లో ఒకటి తమిళ హీరో సూర్య హీరోగా నటించనున్న ఓ కొత్త సినిమాతో పాటు త్రివిక్రమ్, మహేష్ కలయికలో రానున్న సినిమాలో కూడా రష్మికనే హీరోయిన్‌గా అనుకుంటున్నారట. ఇక ‘పుష్ప’ కూడ హిట్టయితే ఈ బ్యూటీ స్థాయి ఇంకా పెరిగిపోతుంది. మొత్తానికి రష్మిక క్రేజ్ ఇప్పుడు మాములుగా లేదు.

Rashmika gets offer in Mahesh-Trivikram Film?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News