Monday, April 29, 2024

బీజింగ్‌లో లాక్‌డౌన్లు

- Advertisement -
- Advertisement -

Beijing seals off mall due to covid-19

బీజింగ్ : చైనా రాజధాని బీజింగ్‌లోని కొన్ని ప్రాంతాలలో ఉన్నట్లుండి తిరిగి కరోనా వైరస్ ఉధృతి దాల్చింది. దీనితో బీజింగ్ అధికారులు హుటాహుటిన అక్కడి ఓ మాల్‌ను మూసివేయించారు. పలు నివాసిత కాలనీలు, అపార్ట్‌మెంట్లలో లాక్‌డౌన్లు విధించారు. ఇటీవలి రోజులలో బీజింగ్ పరిధిలోకి వచ్చే జిల్లాల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే తీవ్రత ఏ స్థాయిలో ఉందనేది స్పష్టం కాలేదు. చైనాలో చాలా వరకూ వైరస్ వ్యాప్తిని అదుపులోకి తీసుకువచ్చారు. ఎప్పటికప్పుడు తక్షణ లాక్‌డౌన్లు, సామూహిక టెస్టులు, ప్రయాణ ఆంక్షలతో వైరస్ నివారణకు దిగుతున్నారు. అయితే గత నెలలో దేశంలో అంతర్గతంగా ప్రయాణాలు ఎక్కువ కావడంతో కొన్ని చోట్ల వైరస్ వ్యాప్తి అవుతోంది. దీనిని నివారించడం తలకు మించిన భారం అయింది. సెంట్రల్ జిల్లాలు అయిన ఛావోయాంగ్ , హైడియన్‌లలో గురువారం కొన్ని కరోనా కేసులు నమోదు అయినట్లు స్థానిక టీవీ మీడియా వార్తలు వెలువరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News