Monday, April 29, 2024

నేడు సీతారాముల కల్యాణం

- Advertisement -
- Advertisement -

శ్రీరామనవమి సందర్భంగా ముస్తాబైన భద్రాద్రి
కరోనా దృష్ట్యా 50 మంది విఐపిల సమక్షంలో వేడుక

Bhadrachalam Seetharamula Kalyanam

మన తెలంగాణ/భద్రాచలం: లోక నాయకుడు, జగదభి రాముని కల్యాణం నేడు కన్నుల పండువగా జరగనుంది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో శ్రీసీతారాముల కల్యాణం అంతరంగికంగా నిర్వహించను న్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో బుధవారం అభిజిత్ లగ్నం ప్రవేశించగానే మధ్యాహ్నం 12 గంటలకు శ్రీసీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహిస్తారు. కరోనా దృష్టా కేవలం 50 మంది విఐపిలతోనే శ్రీసీతాముల కల్యాణం నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి శ్రీసీతారాముల కల్యాణం, మహా పట్టాభిషేక మహోత్సవాల్లో పాల్గొంటారు. ఆయనతో పాటు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఇతర విఐపిలు హాజరు కానున్నారు. ఆన్‌లైన్‌లో రాములోరి కల్యాణాన్ని భక్తులు వీక్షించవచ్చు.
రాష్ట్ర ప్రజలకు సిఎం కెసిఆర్ శ్రీరామనవమి శుభాకాంక్షలు
రాష్ట్ర ప్రజలకు సిఎం కెసిఆర్ శ్రీ రామనవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని కరోనా దృష్టా సామూహికంగా జరుపుకోలేకపోతున్నామన్నారు. లోక కళ్యాణం కోసం ఎన్నో త్యాగాల కోర్చిన సీతారాముల పవిత్రబంధం అజరామరమైనదన్నారు. ప్రజలం దరూ సుఖసంతోషాలతో జీవనం సాగించేలా దీవించాలని సీతారామ చంద్రమూర్తులను సిఎం కెసిఆర్ ప్రార్థించారు.

Bhadrachalam Seetharamula Kalyanam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News