Monday, April 29, 2024

బిగ్‌బాస్ ఓటిటి

- Advertisement -
- Advertisement -

Bigbass launch in OTT soon

 

విభిన్న కంటెంట్‌లతో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ రాబోతోంది. ఫ్యామిలీ డ్రామా, డార్క్ కామెడీ, క్రైమ్ థ్రిల్లర్, రియాలిటీ టివి… ఇలా అన్ని రకాల జోనర్లను టాలీవుడ్ ప్రేక్షకులకు అందించబోతోంది. ఈ నేపథ్యంలో నాగార్జున హోస్ట్‌గా వచ్చిన రియాల్టీ షో ‘బిగ్ బాస్’ లైవ్ స్ట్రీమింగ్ కూడా డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో అందుబాటులోకి రాబోతోంది. ఈ మేరకు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగార్జున మాట్లాడుతూ “బిగ్‌బాస్ ఓటీటీ ప్రారంభించాలనుకుంటున్నామని డిస్నీ హాట్ స్టార్ యాజమాన్యం నా వద్దకు వచ్చి చెప్పడంతో షాక్ అయ్యాను. బిగ్‌బాస్‌కి పూర్తి విభిన్నంగా ఈ షో ఉంటుంది. త్వరలోనే ఓటీటీలో బిగ్‌బాస్ ప్రారంభంకానుంది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంజలి, మధుశాలిని, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రతినిధులు సునీల్ రాయన్, గౌరవ్ బెనర్జీ తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News