Sunday, April 28, 2024

జీ-సోనీ విలీనానికి ఆమోదం

- Advertisement -
- Advertisement -

Board approval for G-Sony merger

విలీన సంస్థకు సిఇఒగా పుణీత్ గోయెంకా

న్యూఢిల్లీ : సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్ ఇండియా, జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్(జీల్) మధ్య విలీనానికి జీ ఎంటర్‌టైన్‌మెంట్ బోర్డు డైరెక్టర్లు ఆమోదం తెలిపారు. ఈ మేరకు మీడియా సంస్థ స్టాక్ ఎక్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. ఈ విలీనం సంస్థలో సోని సంస్థ 50.86 శాతంతో మెజారిటీ వాటాను సొంతం చేసుకోనుంది. జీల్ బోర్డు సోనీ పిక్చర్స్ నెట్‌వరక్స్ ఇండియాతో విలీనానికి ఆమోదం తెలిపింది. కొత్త కంపెనీలో సోనీ 50.86 శాతం వాటాను కలిగి ఉండగా, జీల్ ప్రమోటర్ గ్రూప్ ఎస్సెల్ 3.99 శాతం కలిగి ఉంది. జీల్ వాటాదారులు 45.15 శాతం వాటాను కలిగి ఉంటారు. రెండు కంపెనీల మధ్య విలీనం 2021 సెప్టెంబర్ 22న ప్రకటించారు. 90 రోజుల గడువు డిసెంబర్ 21తో ముగిసింది.

రెండు కంపెనీలు బైండింగ్ ఒప్పందంపై సంతకం చేశాయి. ఒప్పందం ప్రకారం, సోనీ 1.5 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతుంది. విలీనమైన కంపెనీలో 50.86 శాతం వాటాను కలిగి ఉంటుంది. కంపెనీ ఎండి, సిఇఒగా పునీత్ గోయెంకా కొనసాగనున్నారు. కొత్త కంపెనీ తొమ్మిది మంది సభ్యుల బోర్డులో ఐదుగురు సోనీ ఎగ్జిక్యూటివ్‌లు ఉంటారు. వచ్చే ఐదేళ్లపాటు కంపెనీకి పునీత్ గోయెంకా ఎండి, సిఇఒగా ఉంటారు. ఈ విలీనం తర్వాత కంపెనీని భారతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్ చేస్తారు. ఈ ఒప్పందం వల్ల రెండు కంపెనీలు లాభపడనున్నాయి. రెండు కంపెనీలు ఒకదానికొకటి కంటెంట్, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను యాక్సెస్ చేయనున్నాయి. దీంతో భారత్‌లో సోనీ తన ఉనికిని పెంచుకునే అవకాశం లభిస్తుంది. జీల్ ద్వారా సోనీ ప్రపంచవ్యాప్తంగా 130 కోట్ల మంది వీక్షకులను పొందనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News