Monday, April 29, 2024

బాలీవుడ్ నటుడు సందీప్ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Bollywood actor sandeep nahar commit suicide

 

ముంబయి: బాలీవుడ్ నటుడు సందీప్ నహర్(32) ఆత్మహత్య చేసుకున్నాడు. కేసరి, ఎంఎస్ ధోని బయోపిక్ సినిమాల్లో నటించారు. సోమవారం సాయంత్రం ఫేస్ బుక్ లో సూసైడ్ నోట్ పెట్టిన కొంత సమయానికే అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య కాంచన్, అత్త రెండేళ్లుగా తనని వేధిస్తుందని, చంపుతానని బెదిరిస్తుందని అందుకే చనిపోతున్నానని సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు.  బాలీవుడ్ సినిమాల్లో రాజకీయ రంగు పులుముకోవడంతో కొందరు నటులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. సందీప్ ఉరేసుకున్న సమయంలో భార్య కూడా ఇంట్లోనే ఉందని పోలీసులు వెల్లడించారు. సందీప్ వెంటనే రెండు ఆస్పత్రులకు తీసుకెళ్లిందని, అప్పటికే అతడు చనిపోయాడని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. 2020 జూన్ లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కూడా ఆత్మహత్య చేసుకున్న విషయం విధితమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News