Saturday, April 27, 2024

యాసంగి నాటికి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తాం

- Advertisement -
- Advertisement -

కల్వకుర్తి రూరల్ : యాసంగి ప్రారంభం నాటికి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా జంగారెడ్డిపల్లి నుంచి నాగిళ్ల వరకు డి 82 కాలువ పనులు పూర్తి చేసిరైతులకు సాగునీరు అం దివ్వాలని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ంలో కెఎల్‌ఐ ఇంజనీరింగ్ అధికారులు మధు ఖాన్ కాంట్రాక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉమ్మడి పాలమూరు జిల్లాలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 4 లక్షల 26 వేల 216 ఎకరాలకు సాగునీరు అందించడమే లక్షంగా ప్రాజెక్టుని రూపొందించి అమలుపరిచామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ రైతాంగానికి ముఖ్యమంత్రి కెసిఆర్ వెన్నుదన్నుగా నిలిచారని ఆయన అన్నారు.

డి 82 కాలువ ద్వారా 60 వేల ఎకరాలకు సాగు నీరు లక్షంగా అధికార యంత్రాంగం పనిచేసి జులై 28 నాటికి పనులు పూర్తి చేసి సాగునీరందివ్వాలని అధికారులను ఆదేశించారు. కెఎల్‌ఐలో భూములు కోల్పోయిన నాగర్‌కర్నూల్ జిల్లాలోని రైతులకు 16 కోట్ల 34 లక్షలు, రంగారెడ్డి జిల్లాలోని రైతులకు 16 కోట్ల 34 లక్షల రూపాయలను మంజూరు చేయించారని ఎమ్మెల్యే అన్నారు.

అదనంగా 20వేల ఎకరాలకు సాగునీరు
డి82 కాల్వ ద్వారా కల్వకుర్తి మండలం జంగారెడ్డిపల్లి నుంచి మాడుగుల మండలం నాగిళ్ల వరకు 40 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని, ప్రస్తుతం యాసంగి నాటికి మరో 20 వేల ఎకరాల కు అదనంగా సాగునీరు అందించే లక్షంతో అధికారులు పనిచేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆ దేశించారు. డి 82 కాలువ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

* సిఎంకు కృతఙ్ఞతలు
కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా డి 82 కాలువలో భూములు కోల్పోయిన రైతులకు 40 కోట్ల రూపాయల పరిహారం నిధులు మంజూరు చేయించాలని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ప్రత్యేకంగా ఆయన కృతఙ్ఞతలు తెలిపారు. మధుఖాన్ కంపెనీకి చెల్లించాల్సిన బకాయిలను మంజూరు చేయించారు.

జులై 28 నాటికి పనులు పూర్తి కావాలి
డి 82 కాల్వ పనులను జూన్, జులై 28 నాటికి పనులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.సమావేశంలో ఇంజనీరింగ్ శ్రీకాంత్, మధుకాంత్ కం పెని డిజిఎం కృష్ణ, కెఎల్‌ఐ డిఈ దేవన్న ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News