Thursday, May 9, 2024

గ్రీన్ మున్సిపాలిటీ అవార్డు హర్షణీయం

- Advertisement -
- Advertisement -

మక్తల్ : హరితహారంలో భాగ ంగా మక్తల్ పట్టణంతో పాటు గ్రామాల్లోనూ విరివిగా మొక్కలను నాటి పచ్చదనం పెంపొదించామని.. దీన్ని ప్రభుత్వం గుర్తించి మక్తల్ మున్సిపాలిటీకి గ్రీన్ అవార్డు దక్కడం హర్షణీయమని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు.

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మక్తల్ మండలంలోని సంగంబండలో సోమవారం హరితోత్సవం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గురుకు ల పాఠశాల వద్ద గల ఇరిగేషన్ భూముల్లో మొక్కలను నాటి సంపద వనం పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆ యన మాట్లాడుతూ.. మక్తల్ నియోజకవర్గంలోని దాదాపు 141గ్రామాల్లో వన నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలను పెంచడంతో పాటు ప్రభుత్వ, ప్రై వేటు స్థలాలు, కార్యాలయాల వద్ద విరివిగా మొక్కలను నాటడం జరిగిందన్నారు.

ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి సంరక్షించి పచ్చదనాన్ని పెంపొదిద్దామని, తద్వారా పర్యావరణాన్ని కాపాడుకుందామన్నారు. నియోజకవర్గంలోని ప్రధాన రహదారుల వెంబడి దాదాపు 50వేల మొక్కలను నాటి స ంరక్షి ంచామన్నారు. మక్తల్ నుంచి పస్పుల, మాగనూరు నుంచి కృష్ణా, జక్లేర్ నుంచి నర్వ ప్రధాన రహదారులు ప్రస్తుతం పచ్చదనంతో కళకళలాడుతున్నాయన్నారు. అలాగే 167వ జాతీయ రహదారి మధ్యలో మొక్కలను నాటి పట్టణానికి ఆహ్లాదకర వాతావరణాన్ని తీసుకువచ్చామన్నారు.

హరితోత్సవం సందర్భంగా ఇటీవల గురుకుల పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందించి ప్రత్యేకంగా అభినందించారు. అలాగే పచ్చదనం పెంపొందించేందుకు కృషి చేస్తోన్న వన సహాయకులు యర్సన్‌పల్లి రాములు, బిజ్వార్ నర్సిములు, కిష్టప్పలకు జ్ఞాపికలను అందించారు. అంతకుము ందు మక్తల్ పట్టణంలోని పిఎసిఎస్ కార్యాలయం, తిరుమలయ్య చెరువు,ఊట్కూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణల్లో ఎమ్మెల్యే చిట్టెం మొక్కలను నాటి నీళ్లను పోశారు.

కార్యక్రమంలో ఎ ంపిడీఓ శ్రీధర్, ఎంపిపి వనజ, ఎఫ్‌ఆర్‌ఓ నారాయణరావు, సర్పంచు రాజు, ఎంపిటిసిలు జి.బలరాంరెడ్డి, తిమ్మప్ప, ఉప సర్పంచు కేశవరెడ్డి, ఫారెస్టు సె క్షన్ ఆఫీసర్ నీలేష్, పంచాయతి కార్యదర్శులు అ నిత, భాస్కర్, నాయకులు మహిపాల్‌రెడ్డి, అమరేందర్‌రెడ్డి, నేతాజీరెడ్డి, ఈశ్వర్‌యాదవ్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News