Monday, April 29, 2024

ట్యాంక్‌బండ్‌పై కారు బోల్తా..

- Advertisement -
- Advertisement -

Car Accident at Tank bund in Hyderabad

మనతెలంగాణ/హైదరాబాద్: అతివేగంగా వచ్చిన కారు అదుపు తప్పడంతో పల్టీలు కొట్టింది. ఈ సంఘటన నగరంలోని ట్యాంక్ బండ్‌పై శనివారం చోటుచేసుకుంది. కారులో ఉన్న వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఎన్టీర్ మార్గ్ వద్ద అతివేగంగా వచ్చిన కారు ఒక్కసారిగా అదుపు తప్పడంతో పల్టీలు కొట్టింది. ఆ సమయంలో వాహనాలు ఎక్కువగా లేకపోవడంతో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అదేసమయంలో కారులోని బెలూన్లు ఒక్కసారిగా తెరుచుకోవడంతో కారులు ఉన్నవారు చిన్న గాయాలతో బయటపడ్డారు. గాయపడ్డవారిని పోలీసులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కారు నడిరోడ్డుపై పడడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వెంటనే ట్రాఫిక్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్రేన్ సాయంతో కారును పక్కకు తొలగించడంతో ట్రాఫిక్ క్లియర్ అయింది.

Car Accident at Tank bund in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News