Monday, April 29, 2024

రోడ్డుపై నగదు.. ఎవరూ ముట్టుకోలేదు!

- Advertisement -
- Advertisement -

500 note

 

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఉత్తర ఢిల్లీలోని లారెన్స్ రోడ్డులో బుధవారం నడిరోడ్డు మీద మూడు 500 నోట్లు పడి ఉన్నాయి. అందరికీ కనిపిస్తున్నా ఎవరూ ముట్టుకోలేదు. ఈలోగా ఎవరో పోలీసులకు ఫోన్ చేశారు. కరెన్సీ నోట్లతో కరోనా వస్తుందని ప్రజల్లో ఉన్న అపోహలే ఇందుకు కారణం. మధ్యాహ్నం సుమారు 1.15 గంటలకు ఓ ఇంటిముందు మాసిపోయిన 500 నోట్లు మూడు పడిఉండడం ఎవరో చూశారు. ఇక అప్పటినుంచి ఆ ప్రాంతంలో టెన్షన్ మొదలైంది. అందరూ దూరం నుంచి భయంభయంగా చూసి వెళ్లిపోతున్నారు. ఫోన్ సమాచారం రావడంతో పోలీసులు వచ్చి ఆ ప్రాంతాన్ని కార్డన్ చేశారు. ఒక పోలీసు చేతితొడుగు వేసుకుని నోట్లను జాగ్రత్తగా తీసి చేతుల్లో పెట్టుకున్నాడు. వాటిపై శానిటైజర్ స్ప్రే చేసి ఓ కవరులో భద్రంగా పెట్టాడు.

పోలీసులు చుట్టుపక్కల విచారిస్తే ఎవరూ ఆ నోట్లు తమవని ముందుకు రాలేదు. చివరకు వైజయంతి కౌర్ అనే అనే మహిళా టీచరు పోలీసు స్టషన్‌కు రావడంతో సస్పెన్స్ వీడింది. తాను ఏటీఎం నుంచి పదివేల రూపాయలు తెచ్చానని, కరెన్సీ నోట్లతో కరోనా వస్తుందమోననే భయంతో వాటిని కడిగి బాల్కనీలో టేబుల్‌పై ఆరేశానని ఆమె పోలీసులకు చెప్పారు. గాలికి అందులో ఓ మూడు నోట్లు ఎగిరిపోయి ఇంటిముందు పడినట్లున్నాయని, ఆ మేరకు తన మొత్తం నగుదులో 1500 లోటు వచ్చిందని చెప్పింది. ఆమె దగ్గరున్న మిగతా నోట్ల సిరీస్ తనిఖీ చేసుకుని ఆ నోట్లు ఆమెవేనని నిర్ధారించుకుని పోలీసులు వాటిని ఆమెకు ఇచ్చిపంపారు.

 

Cash on the road No one touched it
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News