Monday, April 29, 2024

జడ్జీలను దూషించిన కేసులో ఇద్దరు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

CBI arrests two more from Andhra Pradesh

అమరావతి: జడ్జీలను దూషిస్తూ పోస్టులు పెట్టిన కేసులో సిబిఐ అధికారులు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో న్యాయమూర్తులపై దూషణలకు పాల్పడిన ఆదర్శ్, ఎల్ సాంబశివారెడ్డి, కొండారెడ్డి, సుధీర్‌లతో పాటు కువైట్ నుంచి వచ్చిన లింగారెడ్డి రాజశేఖర్ రెడ్డిలను శనివారం నాడు అరెస్ట్ చేశారు. తమకు బెదిరింపులు వస్తున్నాయంటూ దిగువ కోర్టు న్యాయమూర్తులు ఫిర్యాదు చేసిన తరువాత, కేసు నమోదు చేసిన సీబీఐ, ఎఫ్‌ఐఆర్లో పేర్కొన్న 16 మంది నిందితుల్లో 13 మందిని వివిధ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో గుర్తించింది. వారిలో ముగ్గురు విదేశాల్లో ఉన్నట్లు గుర్తించారు. సిబిఐ ఇప్పటివరకు 13 మందిలో 11 మందిని విచారించి, వారిలో మొత్తం ఐదుగురిని అరెస్టు చేసింది. మిగిలిన 6 గురు నిందితులపై ఆధారాలను పరిశీలిస్తున్నారు. విదేశాల్లో ఉన్న మరో ఇద్దరు నిందితులను సిబిఐ విచారించడానికి ప్రయత్నిస్తోంది.

సిబిఐ 16 మంది నిందితులపై 11.11.2020 న కేసు నమోదు చేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ నుండి వచ్చిన ఫిర్యాదులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఐపిసి సెక్షన్ 153 (ఎ), 504, 505 (2), 506, ఐటి చట్టం, 2000 సెక్షన్ 67 కింద కేసు నమోదు చేశారు. ఉద్దేశపూర్వకంగా న్యాయవ్యవస్థను లక్ష్యంగా చేసుకుని, గౌరవ న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థలకు వ్యతిరేకంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో అవమానకరమైన పోస్ట్లు చేశారని ఆరోపణలు నమోదు అయ్యాయి. అయితే ఎంపి నందిగం సురేష్, వైఎస్సార్ కాంగ్రెస్ నేత ఆమంచి కృష్ణమోహన్ పాత్రను పరిశీలిస్తున్నామని సిబిఐ అధికారులు చెబుతున్నారు. న్యాయమూర్తులపై అనుచిత పోస్టుల వ్యవహారంలో 16 మందిపై కేసులు నమోదు చేసినట్లు సిబిఐ పేర్కొంది.

న్యాయస్థానానికి దురుద్దేశాలను ఆపాదిస్తూ, న్యాయమూర్తులను దూషిస్తూ, వారిని ముక్కలుగా నరకాలి అని హెచ్చరిస్తూ సోషల్ మీడియా వేదికగా రకరకాలుగా దూషించిన వారిపై రాష్ట్ర హైకోర్టు చర్యలకు ఉపక్రమించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటికే 49 మందికి ‘కోర్టు ధిక్కరణ’ కింద నోటీసులు జారీ చేసింది. వీరిలో ఎంపి నందిగం సురేశ్, ఆమంచి కృష్ణమోహన్ కూడా ఉన్నారు. వైసీపీ అభిమానులు ట్విట్టర్, ఫేస్‌బుక్, వాట్సాప్ తదితర సోషల్ మీడియా వేదికగా జడ్జిలను తీవ్ర అసభ్య, అసహ్య పదజాలంతో దూషించారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన ఎపి హైకోర్టు కేసును సుమోటోగా విచారణ చేపట్టింది. న్యాయస్థానం, న్యాయమూర్తులకు వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేయడాన్ని ‘కోర్టు ధిక్కరణగా పరిగణిస్తూ చర్యలకు ఆదేశించింది. ప్రస్తుతం అరెస్ట్ చేసిన ఇద్దరు నిందితులను ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు కాంపిటెంట్ కోర్టు ముందు హాజరుపరచనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News