Thursday, May 9, 2024

సిఎంతో కలిసి పుట్టినరోజు కేక్ కట్ చేసిన మీరాబాయి

- Advertisement -
- Advertisement -

Mirabai Chanu Celebrates Birthday By Cutting Cake With Manipur CM

 

ఇంఫాల్: టోక్యో ఒలింపిక్స్ తొలి రోజే భారత్‌కు సిల్వర్ మెడల్ అందించిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను.. ఆదివారం తన 27వ పుట్టినరోజు జరుపుకుంది. మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్తో కలిసి ఆమె కేక్ కట్ చేయడం విశేషం. సిఎం అధికారిక నివాసానికి వెళ్లిన ఆమెకు ప్రత్యేకంగా కేక్ ఏర్పాటు చేశారు. ఈ కేక్ కటింగ్ వీడియోను బీరేన్ సింగ్ ట్విటర్లో షేర్ చేశారు. ‘తన 27వ పుట్టిన రోజునాడు మీరాబాయి చాను మా అధికారిక నివాసానికి రావడం సంతోషంగా ఉంది. మీరాబాయి, హ్యాపీ బర్త్ డే. దేశానికి ఇలాగే గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను’ అని బీరేన్ సింగ్ ట్వీట్ చేశారు. తన బర్త్ డేను ఎంతో స్పెషల్‌గా మార్చిన ముఖ్యమంత్రికి మీరాబాయి కృతజ్ఞతలు తెలిపింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News