Monday, April 29, 2024

ధాన్య సేకరణకు కేంద్రం నిబంధనాలు

- Advertisement -
- Advertisement -

Center regulations for grain procurement

తేమ, రంగు మారిన గింజలు తదితర అంశాల తగ్గింపు పట్ల రాష్ట్ర రైతుల ఆందోళన
ఈ సారి భారీ దిగుబడి ఇవ్వనున్న వరి
అందుకు తగ్గట్టుగా రాష్ట్రం ఏర్పాట్లు

మన తెలంగాణ/హైదారాబాద్: వానాకాలం పంటల సాగు సీజన్ ము గింపు దశకు చేరుకుంది. ఈ ఏడాది కూడా రాష్ట్రంలో రైతులు పెద్ద ఎత్తున వరి సాగు చేశారు. మరో రెండు నెల ల్లో పంట కాలం పూర్తయి ధాన్యం ది గుబడులు చేతికందబోతున్నాయి. ఈ సారి ధాన్యం దిగుబడులకు తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం మార్కెటింగ్ ప్రణాళికలు సిద్దం చేసుకుంటుంగా, మరో వైపు కేంద్ర ప్రభుత్వం చడి చప్పుడు లేకుండ ధాన్యం సేకరణలో నిబందనలు మార్పు చేయటం పట్లరాష్ట్ర రైతాంగం నుంచి ఆందోళనలు పుట్టుకొస్తున్నాయి. భారత ఆహార సంస్థ ద్వారా ధాన్యం సేకరణలో ఇప్పటివరకూ ఉన్న విధానాలను మార్పు చేసి నిబంధనలు మరింత కఠితన తరం చేయటం భారీగా వరిధాన్యం పండించే తెలంగాణ రాష్ట్ర వ్యవసాయరంగం ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.

ధాన్యంలో తేమశాతం తగ్గింపు, తాలు శాతం తగ్గింపు , బియ్యంలో నూకశాతం తగ్గింపు , తడిసిన , రంగు మారిన ధాన్యం పట్ల నిబంధనలు మరింత కఠిన తరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తెలంగాణ రాష్ట్ర రైతాంగం పాలిట శాపాలుగా మారనున్నాయి. రాష్ట్రంలో సాగునీటి వనరుల పెరగటంతో పంటల సాగు విస్తీర్ణం కూడ భారీగా పెరిగింది. వానాకాలం 55లక్షల ఎకరాల్లో వరినాట్లు వేశారు. తద్వారా 1.48కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి రానుందని ప్రభుత్వం అంచనా వేసింది. అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు , నిల్వలు ,ఎఫ్‌సిఐ ద్వారా బియ్యం సేకరణ తదితర అంశాలపై దృష్టి పెట్టింది. ధాన్యం మార్కెటింగ్ ప్రణాళికలు సిద్దం చేసుకుంటోంది. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే ధాన్యంలో 60లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు ఎఫ్‌సిఐ ఆంగీకారం తెలిపింది. అదనంగా మరో 20లక్షల టన్నుల ధాన్యం సేకరణకు అంగీకారం తెలపాలని కేంద్రాన్ని కోరేందుకు సిద్దమవుతోంది.కేంద్రం బియ్యం సేకరణ విధానంలో చేసిన మార్పులు రాష్ట్రం పాలిట మరింత సమస్యాత్మకంగా మారుతున్నాయి.

ధాన్యం రైతుల పరిస్థితి ఇక దుర్బరమే

కేంద్రం నిబంధనల కారణంగా తెలంగాణ ధాన్యం రైతుల పరిస్థితి దుర్భకంగా మారుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటివరకూ అమల్లో ఉన్న నిబంధనలే మరింత సరళతరం చేయాలని కోరుకుంటున్న రైతులకు కొత్త నిభంధనలు మరింత నష్టదాయకం కానున్నాయని అంటున్నారు. ధాన్యంలో తేమ శాతం 17నుంచి 16శాతానికి తగ్గింపు, రంగు మారి, దెబ్బతిన్న ధాన్యపు గింజల శాతం 5నుంచి 3శాతానికి తగ్గింపు , తాలు మట్టిశాతం 2నుంచి 1శాతానికి కుదింపు, బియ్యంలో నూకల శాతం 25నుంచి 20శాతానికి తగ్గింపు, బియ్యంలో తేమ శాతం 15నుంచి 14శాతానికి తగ్గింపు తదితర కేంద్ర నిర్ణయాల పట్ల రైతుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News