Sunday, April 28, 2024

టీచింగ్ వైద్యుల సమస్యలపై త్వరలో ఛలో హైదరాబాద్

- Advertisement -
- Advertisement -

గోషామహల్: తెలంగాణ టీచింగ్ వైద్యుల సంఘం సభ్యులు ఆదివారం కోఠి లోని ఐఎంఏ హాల్‌లో సర్వసభ్య సమావేశం నిర్వహించా రు. రాష్ట్రంలోని మొత్తం 25 వైద్య కళాశాలల పైన, అసిస్టెంట్ ఫ్రొఫెసర్ల నుండి అడిషనల్ డీఎంఈ స్థాయి వరకు గల టీచింగ్ వైద్యులు ఈ సమావేశం లో పాల్గొని తమ సమస్యలపై చర్చించడంతో పాటు తమ తమ అభి ప్రాయాలను అందరితో పంచుకున్నారు. ఈ సమావేశంలో వైద్యులకు ఉన్న సమ స్యలను పరిష్కరించకుండా, కేవలం వైద్యులపై వత్తిడి పెంచే విధంగా వ్యవస్థ నడుస్తుందని సభ్యులు అభిప్రాయపడ్డారు. బదిలీల విషయంలో ప్రభుత్వ ం త్వరగా స్పందించాలని, లేదంటూ ఇదే ఐక్యతను కొనసాగిస్తూ, సమస్యల పరిష్కారం దిశగా ప్రత్యేక కార్యాచరణ కార్యక్రమం నిర్ణయిస్తామని సం ఘం నాయకులు పేర్కొన్నారు.

ప్రతి నెలా జరుగుతున్న రివ్యూ మీటింగ్‌లో కేవలం టార్గెట్స్ ఇవ్వడమే కాకుండా వైద్యుల సమస్యల గురించి కూడా చ ర్చ జరగాలని, దేశంలో ఆరోగ్య గణాంకాలతో తెలంగాణ ఉత్తమ స్థాయిలో ఉంది అంటే వైద్యులందరి సమిష్టి కృషి వల్లేనని ప్రభుత్వం గుర్తించాలని అన్నారు. సమస్యల విషయంలో గల యేడాది నిరసన చేస్తే, ఆరోగ్య మంత్రి హరీష్‌రావు అందించిన భరోసాతో వెనక్కి తగ్గినప్పటికీ అందులో అనేక స మస్యలు అలాగే ఉన్నాయని సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

సర్వసభ్య సమావేశంలో అనంతరం సభ్యులందరి మద్దతుతో సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసి, నిర్దారిత వా రం రోజుల సమయంలో ప్రభుత్వం స్పందించని పక్షంలో ఛలో హైదరాబాద్ అనే నినాదంతో 500 మందికి పైగా వైద్యులతో కలిసి ఆందోళన చేపట్టాల ని సమావేశంలో సభ్యులందరి ఆమోదంతో నిర్ణయించారు. ఈ సమావేశంలో అధ్యక్షులు డాక్టర్ అన్వర్, ప్రధాన కార్యదర్శ డాక్టర్ జలగం తిరుపతిరావు, ఉపాధ్యక్షులు డాక్టర్ కిరణ్ మాదాల, డాక్టర్ ప్రతిభాలక్ష్మి, కోశాధికారి డాక్టర్ కిరణ్ ప్రకాష్, రీజనల్ సెక్రటరీ డాక్టర్ ఎల్ రమేష్, డాక్టర్ బాబులతో పా టు 200మంది వైద్యులు పాల్గొన్నారు,

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News