Sunday, April 28, 2024

చంద్రబాబు కట్టప్ప రేవంత్ రెడ్డి: గండ్ర

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ /జయశంకర్ భూపాలపల్లి: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మతిస్థిమితం లేని మాటలు మాట్లాడుతున్నారని బిఆర్ఎస్ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రైతులకు మూడు గంటల కరెంటు సరిపోతుందని వ్యాఖ్యలు చేయడంపై మండిపడ్డారు. శుక్రవారం భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే గండ్ర మాట్లాడారు. కాంగ్రెస్ హయం లో 2004 నుండి 2009 వరకు 7 గంటలు విడతల వారీగా కరెంట్ ఇచ్చేవారని అన్నారు. కానీ బిఆర్ఎస్ ప్రభుత్వంలో 24 గంటలు నాణ్యమైన కరెంట్ రైతులకు అందిస్తుందన్నారు. సిఎం కెసిఆర్ నాయకత్వంలో రైతులకు రైతుబంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్తు, సాగునీరు అందించడం వంటి అనేక కార్యక్రమాలు చేపడుతుంటే ప్రతిపక్షాలు ఓర్వలేక కుట్రలు చేస్తున్నాయని గండ్ర మండిపడ్డారు.  ప్రజాహితం కోసం నిరంతరం టిఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుంటే చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

Also Read: అర్థరాత్రి ఫోన్ చేసి రేవంత్ అనుచరులు బెదిరిస్తున్నారు: దాసోజు శ్రవణ్

ఎపి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రిమోట్ కంట్రోల్ లో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు పంపించిన కట్టప్ప రేవంత్ రెడ్డి అని విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీగా మారిందని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి మాట్లాడే భాషా చాలా అధ్వాన్నంగా ఉందని , అలాంటి వారిని ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. సిఎం కెసిఆర్ సింగిల్ గా 109 సీట్లు ఒకేసారి ప్రకటించారని. రేవంత్ మొగొడివి అయితే ఓకే సారి సీట్లు ప్రకటించగలవా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన చత్తీస్ గఢ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో పెన్షన్ ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారనీ గుర్తు చేశారు.

అలాంటిది తెలంగాణలో ఆసరా పెన్షన్ ను రూ.4000 ఇస్తాం అని ప్రగల్బాలు పలుకుతున్నారనీ ధ్వజమెత్తారు. ఉచిత విద్యుత్ విషయంలో ఏమైనా అనుమానాలు ఉంటే రాష్ట్రంలో ఎక్కడైనా ట్రాన్స్ ఫార్మర్లు, కరెంట్ తీగలను రేవంత్ పట్టుకోవచ్చు అని గండ్ర తెలిపారు. సగటు విద్యుత్ వినియోగంలో తెలంగాణ నెంబర్ వన్ గా ఉందని గుర్తు చేశారు. ఇప్పటికైనా అవగాహన లేకుండా మాట్లాడిన అని తెలంగాణ రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

తెలంగాణపై అక్కసు వెళ్లగక్కుతున్న ఎపి మంత్రి బొత్స సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ గురించి చూసుకోండి అని సూచించారు.
కేంద్రం సహకారంతో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ ఇంకా పూర్తి చేయలేదనీ ఎద్దేవ చేశారు. కానీ తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ 3 సంవత్సరాలలో పూర్తి చేసిన విషయాన్ని గండ్ర గుర్తు చేశారు. బొత్స సత్యనారాయణ ఎపి రాష్ట్ర రాజధాని ఎక్కడ, ఎపిలో రోడ్లు ఎలా ఉన్నాయని అడిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ను ఒక్కసారి చూసుకో తరువాత తెలంగాణ గురించి మాట్లాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News