Monday, April 29, 2024

నకిలీ వెబ్‌సైట్లతో ఛీటింగ్

- Advertisement -
- Advertisement -

Cheating with fake websites in Hyderabad

తక్కువ ధరకు ఫర్నీచర్, గ్రాసరీ అమ్మకాల పేరుతో మోసం
రూ.40లక్షల నగదు, డెబిట్ కార్టులు స్వాధీనం
పరారీలో మరో నిందితుడు
వందల్లో బాధితులు, ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలి
వివరాలు వెల్లడించిన సైరాబాద్ సిపి విసి సజ్జనార్

హైదరాబాద్: నకిలీ వెబ్‌సైట్ల ద్వారా తక్కువ ధరకు ఫర్నీచర్, నిత్యావసరాలు ఇస్తామని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేస్తున్న నిందితుడిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుడి వద్ద నుంచి రెండు ల్యాప్ టాప్‌లు, మూడు మొబైల్ ఫోన్లు, 20 డెబిట్ కార్డులు, 6 బ్యాంక్ పాస్‌బుక్‌లు, రూ.40,00,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ తన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, వారణాసి, బేల్‌పూర్, సుధాంపూర్‌కు చెందిన రిషబ్ ఉపాధ్యాయ్ అలియాస్ చందన్ వెబ్ డెవలపర్‌గా పనిచేస్తున్నాడు. డిగ్రీ ఉత్తరప్రదేశ్‌లో చేసిన నిందితుడు ఎంబిఏ ఇంటర్నేషనల్ మార్కెటింగ్ బెంగళూరులో చేశాడు. తర్వాత బెంగళూరులోని పల్లసంత్రా, పూర్వ హైల్యాండ్‌లో ఉంటున్నాడు. మరో నిందితుడు పంజాబ్‌కు చెందిన రాహుల్ డిజిటల్ మార్కెటింగ్ నిపుణుడు. రాహుల్ పరారీలో ఉన్నాడు.

నగరానికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆన్‌లైన్‌లో గ్రాసరీ కోసం WWW.ZOPNOW.IN ఆర్డర్ ఇచ్చాడు. బాధితుడి బ్యాంక్ ఖాతా నుంచి రూ.1,544.40 కట్ అయ్యాయి, కానీ ఎలాంటి మెసేజ్ రాలేదు, గ్రాసరీ గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కస్టమర్ కేర్‌కు ఫోన్ చేశాడు, ఈమెయిల్ చేసినా ఎలాంటి స్పందన రాకపోవడంతో అనుమానం వచ్చిన బాధితుడు రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని పట్టుకున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిందితుడిపై 9 కేసులు నమోదయ్యాయి. నిందితుడు రిషబ్ ఉపాధ్యాయ్ బెంగళూరులో కొద్ది రోజులు బిపిఓలో జూనియర్ డెవలపర్‌గా పనిచేశాడు. తర్వాత వెబ్ డిజైన్ చేయడం నేర్చుకున్నాడు. వెబ్‌డిజైన్ ప్రీలాన్సర్‌గా పనిచేసేవాడు, ఆ సమయంలో WWW.freelancer.com, www.upwork.comలో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు.

మూడేళ్ల క్రితం ఆన్‌లైన్‌లో పరిచయం అయిన ప్రిన్స్ అనే వ్యక్తికి www.jobfinder.info వెబ్‌సైట్‌ను తయారు చేసి ఇచ్చాడు. నిందితుడు 45 రోజుల తర్వాత వెబ్‌సైట్ రివ్యూ కోసం చూడగా ఇది నకిలీ వెబ్‌సైటని, దాని ద్వారా చాలామందిని మోసం చేసినట్లు గుర్తించాడు. దీంతో తానే వైబ్‌సైట్లను డిజైన్ చేసి మోసం చేయాలని ప్లాన్ వేశాడు. దీనికిగాను తన పేరుకు బదులుగా మైకేల్ బ్రేక్, రోనాల్డ్, జాసన్, రాయ్‌రెనీ పేర్లతో www.freelancer.com ద్వారా ఉద్యోగాలు కావాల్సిన వారితో కాంటాక్ట్ చేసేవాడు. పంజాబ్‌కు చెందిన డిజిటల్ మార్కెటింగ్ నిపుణుడు రాహుల్ మార్కెటింగ్ చేసేవాడు. వారి నుంచి అన్ని వివరాలు తీసుకున తర్వాత ఫర్నీచర్ కోసం www.deckun.comను డిజైన్ చేశాడు. ఉద్యోగం కోసం వివరాలు ఇచ్చిన బాధితుడి పేరుతో తయారు చేశాడు.

బెంగళూరులో చాలా పాపులర్ గ్రాసరీ వెబ్‌సైట్ www.zopnow.com కాపీ కొట్టి దీనిని, కెనడాకు చెందిన www.modway.comకు బదులు www.modwayfurniture.inను డిజైన్ చేశాడు. వీటిలోకి వెళ్లి ఫర్నీచర్, గ్రాసరీ కోసం ఆర్డర్ చేసిన వారి బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులు రాజోర్ పే ద్వారా తీసుకునేవాడు. భారీ ఎత్తున డబ్బులు రావడంతో యాప్ నిర్వాహకులు రూ.20లక్షల పేమెంట్‌ను నిలిపివేశారు. దీంతో నిందితుడు డబ్బులు బ్యాంక్ ఖాతాల్లోకి రాగానే వెంటనే వెళ్లి ఎటిఎంల ద్వారా డ్రా చేసుకుని వచ్చి తన రూములో పెట్టుకునేవాడు. ఫేక్‌వెబ్‌సైట్ల ద్వారా తొమ్మిది మందిని మోసం చేశాడు. రాయదుర్గం, మాదాపూర్ ఇన్స్‌స్పెక్టర్లు రాజగోపాల్ రెడ్డి, రవీంద్రప్రసాద్, శ్రీనివాస్ తదితరులు కేసు దర్యాప్తు చేశారు.

ఆన్‌సైట్ జాబ్ పేరుతో…

అమెరికాలో ఆన్‌సైట్ జాబ్‌లు ఇప్పిస్తామని చెప్పి పలువురు బాధితులకు గ్లోబల్ లా ఫర్మ్ పేరుతో ఎర వేశాడు. ఉద్యోగం కావాల్సిన వారు ఎస్‌విసి కో ఆపరేటివ్ బ్యాంక్, బంధన్‌బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతాలు ఓపెన్ చేసి క్రెడెన్షియల్స్, ఎటిఎం కార్డులు, పిన్ నంబర్లు నిందితుడికి ఇచ్చేవారు. వాటి ద్వారా డబ్బులు తీసుకునే వాడు, నకిలీ వెబ్‌సైట్లను తయారు చేసేవాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News