Sunday, April 28, 2024

దేశంలో తగ్గిపోయిన బాల్య వివాహాలు

- Advertisement -
- Advertisement -

అధ్యయనంలో వెల్లడి

న్యూఢిల్లీ: దేశంలో ప్రతి ఆదైగురు బాలికలలో ఒకరు, ఆరుగురు బాలురలో ఒకరు వివాహితులని తాజా అధ్యయనంలో తెలిపింది. బాల్య వివాహాలను అరికట్టేందుకు గత కొన్ని సంవత్సాలుగా తీసుకుంటున్న చర్యలు సత్ఫిలితాలు ఇచ్చాయని ది లాన్సెట్ గ్లోబల్ హెల్త్ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం పేర్కొంది. 2016, 2021 మధ్య కొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో బాల్య వివాహాలు సర్వసాధారణంగా ఉండేవని పరిశోధకులు తమ అధ్యయనంలో పేర్కొన్నారు.

మణిపూర్, పంజాబ్, త్రిపుర, పశ్చిమ బెంగాల్‌లో బాలికల బాల్య వివాహాలు పెరిగిపోగా ఛత్తీస్‌గఢ్, గోవా, మణిపూర్, పంజాబ్‌లో బాలుర బాల్య వివాహాలు పెరిగాయని అధ్యయనంలో వెల్లడైంది. అయితే దేశవ్యాప్తంగా బాల్య వివాహాలు క్రమంగా తగ్గిపోయాయని, 1993లో 49 శాతం బాల్యవివాహాలు ఉండగా 2021 నాటికి 22 శాతానికి తగ్గాయని అధ్యయనంలో పేర్కొన్నారు. బాలుర బాల్య వివాహాలు 2006లో 7 శాతం ఉండగా 2021 నాటికి అవి 2 శాతానికి తగ్గిపోయాయని తేలింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News