Friday, May 3, 2024

జాయ్‌ఫుల్ హాలీడే… జైల్‌ఫుల్ హాలీడే!

- Advertisement -
- Advertisement -

Chiranjeevi shared Photo of his cooking

 

కాలం మారినా తన కథ మారలేదు అంటున్నారు చిరంజీవి. 1990 అయినా… 2020 అయినా తానే వంట చేస్తున్నానని.. తన భార్య వెనుకాల ఉండి సాయం చేస్తుందని అర్థం వచ్చేలా ఒక సెటైరికల్ ఫొటోను తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు ఈ మెగాస్టార్. అప్పుడు జాయ్‌ఫుల్‌గా ఉంటే.. ఇప్పుడు జైల్‌లో ఉన్నట్టు ఉందని ప్రస్తుత పరిస్థితిపై చిరంజీవి సెటైర్ వేసుకున్నారు. అది 1990… అమెరికాలో మెగాస్టార్ చిరంజీవి హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్న సమయం. నాడు ఆయన వంట చేస్తుండగా.. చిరంజీవి భార్య సురేఖ సాయం చేస్తూ వెనుకాలే నిలబడ్డారు. నిజానికి పెళ్లయిన కొత్తలో తన భార్య సురేఖకు వంట చేయడం రాలేదని.. తనే నేర్పించానని చిరంజీవి చెప్పుకొచ్చారు.

బహుశా తర్వాత నేర్చుకున్నా కూడా చిరంజీవి మాత్రం తన పాకశాస్త్ర ప్రావీణ్యంతో ఇప్పటికీ భార్యను పక్కనపెట్టి వంట చేస్తున్నారేమో. తాజాగా 1990లో అమెరికాలో హాలీడేస్‌లో ఉన్నప్పటి ఫొటోను… ఇప్పుడు హైదరాబాద్‌లో లాక్‌డౌన్ హాలీడేస్‌లో ఉంటూ వంట చేస్తున్న ఫొటోను చిరంజీవి షేర్ చేశారు. అదే డ్రెస్.. అదే సందర్భాన్ని చిరంజీవి క్రియేట్ చేసి ఫన్నీగా ఫొటోను షేర్ చేశారు. దానికి ‘కాలం మారినా.. దేశం మారినా.. సురేఖ, తాను మాత్రం ఏమీ మారలేదు’ అంటూ చిరంజీవి క్యాప్షన్ ఇచ్చి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అమెరికాలో 1990లో దిగిన ఫొటోకు ‘జాయ్‌ఫుల్ హాలీడే ఇన్ అమెరికా’ అని క్యాప్షన్ ఇచ్చి… ప్రస్తుతం హైదరాబాద్‌లో ఇంట్లో వంట చేస్తున్న ఫొటోకు ‘జైల్‌ఫుల్ హాలీడే ఇన్ కరోనా’ అని సరదా కామెంట్‌ను జోడించి చిరంజీవి షేర్ చేశారు. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News