Saturday, April 27, 2024

సిఎం కెసిఆర్‌కు వైద్య పరీక్షలు

- Advertisement -
- Advertisement -

ఊపిరితిత్తుల్లో మంటగా ఉండడంతో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చేరి పరీక్షలు చేయించుకున్న ముఖ్యమంత్రి
చలికాలం వల్ల స్వల్ప అస్వస్థత కలిగిందని ఆయన ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బందిలేదన్న వైద్యులు

CM KCR Health Check Up at Yashoda Hospital

మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు గురువారం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేశారు. ఊపిరితిత్తుల్లో మంటగా ఉండటంతో సిఎం వ్యక్తిగ త వైద్యులు ఎం.వి. రావు, శ్వాసకోశ నిపుణుడు డాక్టర్ నవనీత్ సాగర్ రెడ్డి సూచన మేరకు యశోద ఆసుపత్రికి వెళ్లారు. ఊపిరితిత్తుల్లో మంటతో ఆస్పత్రిలో చేరిన ఆయన యశోద వైద్యులు ఎంఆర్‌ఐ, సిటీ స్కాన్ చేశారు. అలాగే సిఎం బ్లడ్ శాంపిల్స్‌ను కూడా తీసుకున్నారు. పరీక్షల ఫలితాలు ఇంకా రాలేదు. ఫలితాలు వచ్చిన తర్వాత వైద్యుల పర్యవేక్షణలో సిఎంకు చికిత్స అందిస్తారని ప్రగతిభవన్ వర్గాలు చెబుతున్నాయి. కాగా సిఎం వెంట ఆసుపత్రికి వచ్చిన వారిలో మంత్రి కెటిఆర్, ఎంఎల్‌సి కవిత, ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ తదితరులు ఉన్నారు.. అయితే సిఎం ఊపిరితిత్తుల్లో స్వల్ప ఇన్ఫెక్షన్ ఉందన్న వైద్యులు బ్లడ్ అండ్ 2డి ఇకో రిపోర్ట్ రావాల్సి ఉందన్నారు. ఆయనకు ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బంది లేదని, అయితే చలికాలం కావడంతోనే స్వల్ప అస్వస్థత కలిగిందన్నారు. వైద్య పరీక్షలు అనంతరం సిఎం కెసిఆర్ తిరిగి ప్రగతి భవన్‌కు చేరుకున్నారు.

CM KCR Health Check Up at Yashoda Hospital

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News