Friday, May 17, 2024

కిడ్నాప్ గురైన సిఎం కెసిఆర్ బంధువుల ఆచూకీ లభ్యం

- Advertisement -
- Advertisement -

CM KCR relative kidnap in Hyderabad

హైదరాబాద్: సిఎం కెసిఆర్ సమీప బంధువు, హాకీ మాజీ క్రీడాకారుడు కిడ్నాప్ కలకలం సృష్టిచింది. కిడ్నాపైన ముగ్గురిని సురక్షితంగా ఇంటికి తీసుకొచ్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… హైదరాబాద్ లోని బోయిన్ పల్లిలో హాకీ మాజీ క్రీడాకారుడు ప్రవీణ్ రావు, అతడి సోదరులు సునీల్ రావు, నవీన్ రావు ఇంట్లో ఉన్నప్పుడు ఐటి అధికారులమంటూ ఇంట్లోకి దుండగులు చొరబడ్డారు. అనంతరం బెదిరించి బలవంతంగా ముగ్గురిని కారులో తీసుకెళ్లారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నార్త్‌జోన్ డిసిపి కల్మేశ్వర్, సెంట్రల్ జోన్ డిసిపి అక్కడికి చేరుకొని దర్యాప్తు చేశారు. సిసి కెమెరాల ఆధారంగా డైమండ్ పాయింట్ నుంచి రాణిగంజ్ మీదుగా రెండు వాహనాలు వెళ్లినట్టు గుర్తించారు. హఫీజ్ పేట భూవివాదమే ఈ కిడ్నాప్ కారణమని పోలీసులు భావిస్తున్నారు. కిడ్నాప్ గురైన వారిని సురక్షితంగా పోలీసులు ఇంటికి తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ఎంపి అఖిల ప్రియ భర్త భార్గవ రెడ్డి పేరు చెప్పి నిందితులు బెదిరించినట్టు సమాచారం. మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపి మాలోతు కవిత అక్కడికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News