Saturday, April 27, 2024

నిరంకుశబిల్లు

- Advertisement -
- Advertisement -

Centre to permits Environmental for Sitarama Project

 

రాష్ట్ర విద్యుత్ సంస్థల స్వతంత్రతపై గొడ్డలిపెట్టు

ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని కొన్ని విధులు, అధికారాలను కట్టడి చేస్తుంది

కేంద్రం ఏర్పాటు చేసే సెలక్షన్ కమిటీ ద్వారా రాష్ట్ర విద్యుత్ నియంత్రణ కమిషన్‌ను నియమించబోవడం ఫెడరల్ వ్యవస్థకు విఘాతం
ఎన్‌ఎల్‌డిసికి అదనపు అధికారాలు అప్పగించడం మంచిది కాదు, రాష్ట్ర థర్మల్ యూనిట్లకు విఘాతం
రాష్ట్ర విద్యుత్ ఉత్పాదక సంస్థలకు నష్టదాయకం
సబ్సిడీలపై విచక్షణాధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉండాలి, విద్యుత్ చట్టానికి ప్రతిపాదించిన సవరణలను నిరసిస్తూ కేంద్రానికి సిఎం కెసిఆర్ లేఖ
బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్

మన తెలంగాణ/హైదరాబాద్: విద్యుత్ చట్టానికి సవరణలు తెస్తూ కేంద్ర ప్ర భుత్వం ప్రతిపాదించిన బిల్లు రాష్ట్ర విద్యుత్ సంస్థల నిర్వహణపై ప్రత్యక్షంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతిపాదిత విద్యుత్ సవరణ బిల్లు 2020పై రాష్ట్రాల అభిప్రాయాలు తెలపాలని కేంద్ర ప్రభుత్వం కోరడంతో, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడికి రాష్ట్ర ప్రభుత్వం తరుఫున ఆందోళన తెలుపుతూ లేఖ రాశారు. ఆ లేఖలో పలు అంశాలపై సిఎం కెసిఆర్ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ప్రధానంగా ప్రతిపాదిత విద్యుత్ చట్ట సవరణలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని కొన్ని విధులు,అధికారాలను కట్టడి చేసే విధంగా ఉన్నాయని వ్యా ఖ్యానించారు. భారత ప్రభుత్వం ఏర్పాటు చే సిన సెలక్షన్ కమిటి ద్వారానే రాష్ట్ర విద్యుత్ నియంత్రణ కమిషన్‌ను నియమించడం, కొన్ని పరిస్థితులలో పొరుగు రాష్ట్రాల విద్యు త్ నియంత్రణ కమిషన్లకు బాధ్యతలు అప్పగించడం అనే నిబంధనపై సిఎం కెసిఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది పూర్తి గా ఫెడరల్ వ్యవస్థకు విఘాతం కలిగిస్తుందన్నారు. జాతీయ పునరుత్పాదక ఇంధన వి ధానాన్ని రాష్ట్ర ప్రభుత్వాల స్పష్టమైన సమ్మతితో రూపొందించాలన్నారు. అలాగే భారతదేశంలోని ప్రతి రాష్ట్రానికి జలవిద్యుత్, పవన విద్యుత్, సౌర విద్యుత్, భూమి లభ్యత వంటి ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయని, అందువల్ల రాష్ట్రాలు విస్తృత విధానంలో జాతీయ స్థాయి లో ఎటువంటి జరిమానా నిబంధనలు లేకు ండా నిర్ణయించే సౌలభ్యాన్ని కలిగి ఉండాలని సూచించారు. ఎస్‌ఎల్‌డిసిని రాష్ట్ర ప్రభు త్వం చాలా సంతృప్తికరంగా అమలు చేస్తోందన్నారు. గ్రిడ్ క్రమశిక్షణ చాలా ముఖ్యమైనదే అయినప్పటికీ అదనపు అధికారాలను ఎన్‌ఎల్‌డిసికి అప్పగించడం మంచిది కాదని ప్రధానికి రాసిన లేఖలో సిఎం కెసిఆర్ సూ చించారు. దీని ఫలితంగా రాష్ట్ర థర్మల్ యూనిట్ల వెనుకబడి ఉంటుందన్నారు. సెంట్రల్ యూనిటింగ్ స్టేషన్లతో రాష్ట్ర యూనిట్లు పోటీపడవన్నారు. ఎన్‌టిపిసి, ఎన్‌హెచ్‌పిసి వంటి సెంట్రల్ జనరేషన్ యుటిలిటీల ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉంటుందని, ఫలితంగా మెరిట్ ఆర్డర్ డెస్పాచ్‌లో ప్రాధాన్యత పొందుతుందన్నారు. దీనివల్ల రాష్ట్ర ఉత్పాదక సంస్థలకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. అందువల్ల, ఇంటర్ స్టేట్ ట్రాన్సిమిషన్ నిర్ణయాలు ఎస్‌ఎల్‌డిసిలకు మాత్రమే వదిలివేయాలన్నారు. ఇంకా ప్రతిపాదిత సవరణ ఎన్‌ఎల్‌డిసికి ఎక్కువ అధికారాలను కట్టబెట్టే విధంగా ఉందని వ్యాఖ్యానించారు. షెడ్యూల్, గ్రిడ్ స్థిరత్వం వంటి సాంకేతిక సమస్యలను మాత్రమే ఎన్‌ఎల్‌డిసికి అప్పగించాలని సూచించారు. ఒక మెగవాట్ కంటే ఎక్కువ వినియోగించే వినియోగదారులకు సాంకేతిక సాధ్యాలు చూడకుండానే ఒపెన్ యాక్సెస్ ఇవ్వడంతో డిస్కమ్స్ ఆదాయం తగ్గుతుందన్నారు. ఇంకా సబ్-లైసెన్సు ఓపెన్ యాక్సెస్ జనరేటర్ల నుండి శక్తిని పొందవచ్చు…. రిటైల్ మార్కెట్లో అమ్మవచ్చున్నారు. ఇది డిస్కమ్‌ల యొక్క ఆర్ధిక సామర్ధంపై కూడా ప్రభావితం చేస్తుందన్నారు. ముసాయిదా బిల్లులో వినియోగదారులకు, ముఖ్యంగా వ్యవసాయ, దేశీయ రంగాలకు అందించే సబ్సిడీ యొక్క ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డిబిటి) కొరకు కూడా ఒక నిబంధన ఉందన్నారు. ఇది రైతులు, పేద వినియోగదారుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. రైతులకు 24/7 రోజుల పాటు ఉచిత విద్యుత్ ఇవ్వాలన్నదే తెలంగాణ ప్రభుత్వ విధానమన్నారు. ఈ నేపథ్యంలో సబ్సిడీ చెల్లించే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి వదిలివేయాలన్నారు. ఈ నిర్దిష్ట అంశంపై ప్రస్తుత శాసనాన్ని సవరించే ఏదైనా ప్రతిపాదన మన ప్రభుత్వానికి చాలా అభ్యంతరకరంగా ఉంటుందని సిఎం వ్యాఖ్యానించారు.వినియోగదారులందరికీ సుం కాన్ని కమిషన్ నిర్ణయిస్తుందని ప్రతిపాదించబడిందన్నారు. ఏ రాయితీ లేకుండా. ప్రస్తుతం కమిషన్ సుంకం స్థిరీకరణలో కొన్ని వర్గాల వినియోగదారులు భరించాల్సిన కొన్ని క్రాస్ సబ్సిడీలు ఉన్నాయి. ప్రతిపాదిత సవరణతో, వ్యవసాయంతో సహా అన్ని వర్గాల వినియోగదారులకు వాస్తవ ధర కోసం బిల్లులు జారీ చేయబడతాయి. కాబట్టి ఈ నిబంధనలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆ లేఖలో సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. సబ్సిడీని విధించే విచక్షణ అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండడమే మంచిదని అభిప్రాయపడ్డారు. కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ చట్ట సవరణ ముసాయిదా రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను నియంత్రించే విధంగా ఉందని సిఎం కెసిఆర్ అన్నారు. ఇంకా ఈముసాయిదా బిల్లులో అన్ని ఒప్పంద సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర స్థాయిలో విద్యుత్ కాంట్రాక్ట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అథారిటీని ప్రతిపాదించారని, అయితే ఒప్పందాలపై సివిల్ కోర్టులు తీర్పు ఇవ్వాల్సి ఉంటుందని, దీంతో అనేక మరిన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. కేంద్రం తీసుకువస్తున్న కొత్త సవరణలు ప్రజా ప్రయోజనాలకు సంబంధించినవిగా లేవని ప్రధానికి రాసిన లేఖలో సిఎం కెసిఆర్ తెలిపారు.

CM KCR to Oppose NDA’s New Power bill

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News