Sunday, April 28, 2024

రూ.300 కోట్ల పెండిగ్ చలాన్ల వసూలు

- Advertisement -
- Advertisement -

Collection of pending challans of Rs.300 crore

 

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ట్రాఫిక్ చలాన్ల క్లియరెన్స్‌కు భారీ స్పందన వచ్చిందని, 3 కోట్ల పెండింగ్ చలాన్లకు సంబంధించి రూ. 300 కోట్ల మేరకు ప్రభుత్వానికి ఆదాయం చేకూరినట్లు పోలీసుశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. పెండింగ్ చలాన్‌లను వసూలు చేసేందుకు పోలీసు శాఖ ప్రకటించిన ఆఫర్‌లో 65 శాతంపైగా పెండింగ్ చలాన్లు వాహనదారులు క్లియర్ చేసినట్లు వివరించారు. ఒక్క హైదరాబాద్ నగరలోనే 1.70 కోట్ల పెండింగ్ చలాన్లు క్లియర్ అయ్యాయని తెలిపారు. కాగా శుక్రవారం నాటితో చలాన్ల డిస్కౌంట్ ఆఫర్ ముగిసిందని, మరోసారి ఆఫర్ పొడిగింపు ఉండదని పోలీస్ శాఖ ఉన్నతాధికారులు తేల్చిచెప్పారు.

ఈక్రమంలో రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న వాహన చలాన్‌లకు సంబంధించి మార్చి 1వ తేదీ నుంచి ఏప్రిల్ 15వరకు అవకాశం ఇవ్వడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా టువీలర్ వాహనదారులకు 75 శాతం, కార్లకు 50, బస్సులకు 30 శాతం చెల్లించేందుకు అవకాశం కల్పించారు. అదేవిధంగా తోపుడు బండ్లకు 20 శాతం రిబేట్ ఇచ్చారు. తొలుత మార్చ్ ఒకటి నుంచి 30వ తేదీ వరకూ చెల్లింపునకు అవకాశం ఇచ్చిన అధికారులు వాహనచోదకులు విజ్ఞప్తి మేరకు మరో 15 రోజుల పాటు (ఏప్రిల్ 15) పొడిగించారు. ముఖ్యంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో రూ.600 కోట్ల పైచిలుకు పెండింగ్ చలాన్లు ఉండటంతో వాటిని క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ విభాగం పోలీసు అధికారులు ఈ కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా రూ.వెయ్యి కోట్ల విలువైన చలానాలు క్లియర్ కాగా డిస్కౌంట్‌లో చెల్లించిన మొత్తాలు రూ.300 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.

ఇతర రాష్ట్రాల వాహనాలు 

రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ చలానాలు దాదాపు రూ. 1200 కోట్ల ఉన్నాయని, అయితే వాటిలో 14శాతం మేరకు ఇతర రాష్ట్రాల వాహనాలు ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర పోలీసులు పెండింగ్ చలానాల వసూళ్ల నిమిత్తం ఇచ్చిన ఆఫర్‌లో 65శాతం మేరకు వాహనాలకు సెండింగ్ చలాన్‌లు వసూలయ్యాయి. మిగిలిన వాహనాలలో 14శాతం ఇతర రాష్ట్రాల వాహనాలు, ఉపయోగంలో లేని వాహనాలు ఉన్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. అధిక చలాన్లు ఉన్న వాహనాలను మరికొందరు స్క్రాప్ కింద విక్రయించి ఉంటారని వివరిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News