Saturday, April 27, 2024

నిలకడగా జాన్సన్ ఆరోగ్యం

- Advertisement -
- Advertisement -

Johnson

 

బ్రిటన్: కరోనా వైరస్‌తో బాధపడుతున్న బ్రిటన్ ప్రధాని ఆరోగ్యం నిలకడగా ఉందని, స్పృహలోనే ఉన్నారని అధికారులు తెలిపారు. ఆయన ఇంకా ఐసియులోనే ఉన్నారని, అయితే వెంటిలేటర్‌పై లేరని కేబినెట్ మంత్రి మైఖేల్ గోవ్ వెల్లడించారు. శ్వాస తీసుకోవడంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండడానికి ఆక్సిజన్ అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా జాన్సన్ గైరుహాజరులో ఆయన బాధ్యతలు నిర్వహించడానికి విదేశాంగ మంత్రి డొమినిక్ రాబ్ సిద్ధమయ్యారు. కరోనాపై మంగళవారంనుంచి జరగబోయే అన్ని సమీక్షలను రాబ్ పర్యవేక్షిస్తారని గోవ్ తెలిపారు.

ఇదిలా ఉండగా గత అయిదు రోజులుగా కరోనా మరణాలు తగ్గుముఖం పట్టిన స్పెయిన్‌లో మంగళవారం మళ్లీ మరణాల సంఖ్య పెరిగింది. అక్కడ ఒక్క రోజే 743 మరణాలు సంభవించగా కొత్త కేసులు 5,400 పెరిగాయి. అయితే కరోనా ఉధృతి తగ్గుముఖం పడుతోందన్న ఆశాభావాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రపంచంలోనే అత్యధిక మరణాలు సంభవించిన ఇటలీలో మరణాల సంఖ్య 16,500కు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఈస్టర్ రోజు కూడా ప్రజలు లాక్‌డౌన్ నిబంధనలు పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు మరో వైపు ఫ్రాన్స్‌లో మరణాలసంఖ్య 10,000 మైలురాయిని దాటిపోయింది. అయితే వైరస్ వ్యాప్తి ఉధృతి తగ్గుముఖం పడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని అధికారులు చెప్తున్నారు.

 

Consistently Johnson Health
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News