Monday, April 29, 2024

‘శంషాబాద్’ ప్రమాదంపై ముగిసిన దర్యాప్తు.. కానిస్టేబుల్ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Constable arrested in Shamshabad's road accident

మనతెలంగాణ/హైదరాబాద్: శంషాబాద్ వద్ద కారును తప్పించబోయి లారీ బోల్తాపడిన ఘటనలో ఆదివారం ఆరుగురు మృతి చెందగా చికిత్స పొందుతూ మంగళవారం మరో యువకుడు మృతి చెందాడు. దీంతో ప్రమాదంలో మొత్తం మృతుల సంఖ్య ఏడుకు చేరింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులi కారును నిర్లక్ష్యంగా నడిపి ప్రమాదానికి కారణమైన వ్యక్తిని మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న గిరిప్రసాద్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇదిలావుండగా మాదాపూర్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న గిరిప్రసాద్, అదే స్టేషన్లో హోంగార్డ్ సంగమేశ్వర్, మల్లేశ్‌లు ఆదివారం ఉదయం కారులో యాదగిరి గుట్టకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఒఆర్‌ఆర్ మీదుగా శంషాబాద్ వద్ద చిత్తుగా మద్యం సేవించారు. అనంతరం రోడ్డు పైకి వచ్చిన కారు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్న ప్రమాదంలో లారీ బోల్తా పడింది. ఘటనలో లారీలో ఉన్న కూలీల్లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు చనిపోయారు. తాజాగా మరో వ్యక్తి ఉస్మానియాలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు.

దీంతో ప్రమాదానికి కారణమైన కానిస్టేబుల్ గిరిప్రసాద్‌ను శంషాబాద్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా ప్రమాదానికి కారణమైన కారుపై గతంలో ర్యాష్ డ్రైవింగ్ చేసినట్లు చలాన్ గుర్తించారు. కాగా కారులో ప్రయాణిస్తున్న గిరిప్రసాద్, సంగమేశ్వర్, మల్లేశ్‌లకు పరీక్షలు నిర్వహించగా హోంగార్డు మద్యం సేవించినట్లుగా, కానిస్టేబుల్ గిరిప్రసాద్ మద్యం సేవించనట్లు వచ్చింది. దీంతో వారి రక్త నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులుదర్యాప్తు వేగవంతం చేశారు.

Constable arrested in Shamshabad’s road accident

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News