Monday, April 29, 2024

డ్రంకెన్ డ్రైవ్ యాక్సిడెంట్.. కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలో మరో డ్రంకెన్ డ్రైవ్ యాక్సిడెంట్ జరిగింది. శంషాబాద్ ఎయిర్ పోర్టు వద్ద మంగళవారం ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. దీంతో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో వెంటనే కానిస్టేబుల్ చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

Constable injured in Road Accident at Shamshabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News