Wednesday, May 1, 2024

మహంత్ గోపాల్‌దాస్ అధ్యక్షతన రామాలయ ట్రస్ట్

- Advertisement -
- Advertisement -

Ayodhya

 

ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్, కోశాధికారి గోవింద్‌గిరి
15 రోజుల్లో నిర్మాణ షెడ్యూల్ ప్రకటన

న్యూఢిలీ: అయోధ్యలో రామాలయ నిర్మాణ పనుల తేదీ లను 15 రోజులలో ప్రకటి స్తారు. కేంద్రం ఏర్పాటు చేసిన రామాలయ ట్రస్టు బుధవారం జరిపిన తొలి భేటీ తరువాత ఈ విషయం వెల్లడి అయింది. ఆలయ నిర్మాణ వ్యవహారాలకు సంబంధించి ఈ భేటీలో కీలకమైన నిర్మాణ సమితిని ఏర్పాటు చేశారు. రామ మందిర ట్రస్టుకు సారధ్య బాధ్యతలను అప్పగిస్తూ 15 మంది సభ్యులతో ఈ నెల 5వ తేదీనే ప్రధాని మోడీ పార్లమెంట్‌లో ట్రస్టు ఏర్పాటు ప్రకటన చేశారు. దీనికి శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టీగా దీనిని వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కె పరాశరన్ ట్రస్టీగా నియమితులు అయ్యారు. స్థానికంగా ఉండే పరాశరన్ నివాసం కైలాష్‌లోనే ట్రస్టు సమావేశం జరిగింది.

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సుప్రీంకోర్టు తీర్పు వెలువరించి, ఈ క్రమంలో సంబంధిత విషయాలను ఖరారు చేసేందుకు ట్రస్టు ఏర్పాటు బాధ్యతలను కేంద్రానికి అప్పగించింది. న్యాయవాది నివాసంలో సుదీర్ఘ చర్చల తరువాత కొన్ని కీలక నియామకాలను ప్రకటించారు. దీని మేరకు రామమందిర ట్రస్టు అధ్యక్షులుగా మహంత్ నృత్య గోపాల్ దాస్‌ను, ప్రధాన కార్యదర్శిగా ఛంపత్‌రాయ్‌ను, కోశాధికారిగా గోవింద్ గిరిని ఎన్నుకున్నారు. ట్రస్టు ఆధ్వర్యంలోనే రామాల య నిర్మాణ పనులు పర్యవేక్షణ జరుగుతుంది. ఇక నిర్మాణ పనులను ఎప్పటి నుంచి ఆరంభించాలనే దానిపై ట్రస్టు తర్జనభర్జనలు చేపట్టింది. తొలి భేటీలోనే ఆలయ నిర్మాణ పనుల ఆరంభం గురించి వెల్లడిస్తారని అంతా భావించారు. అయితే దీనిపై తొలి భేటీలో నిర్ణయం జరగలేదు. పక్షం రోజుల తరువాతనే నిర్మాణ ఆరంభ ప్రకటన వెలువడుతుందని వెల్లడయింది.

బుధవారం నాటి సమావేశంలో ఏర్పాటు అయిన నిర్మాణ సమితికి రిటైర్డ్ ఐఎఎస్ అధికారి నృపేంద్ర మిశ్రా సారథ్యం వహిస్తారు. మిశ్రా గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు సలహాదారుడిగా వ్యవహరించారు. 15 రోజుల తరువాత ట్రస్టు తిరిగి భేటీ అవుతుంది. అప్పటికీ కానీ నిర్మాణ పనులు ఎప్పుడు చేపట్టగలమనేది తెలియచేసేందుకు వీలేర్పడుతుందని ట్రస్టు వర్గాలు తెలిపాయి. ట్రస్టు తొలి భేటీ తరువాత ట్రస్టు అధ్యక్షులు గోపాల్ దాస్ విలేకరులతో మాట్లాడారు. ప్రజల విశ్వాసాలను ఆదరిస్తూ, సాధ్యమైనంత త్వరగా ఆలయ నిర్మాణ పనులు చేపడుతామని తెలిపారు. రామందిర ప్రధాన నమూనా మారబోదని, అయితే ఎత్తు వెడల్పులు పెంచేందుకు కృషి చేస్తామని వివరించారు. తొలి భేటీలో కేంద్ర ప్రభుత్వం తరఫున హోం మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి జ్ఞానేష్ కుమార్, యుపి ప్రభుత్వ ప్రతినిధిగా అవినాశ్ అవస్థీ, అయోధ్యజిల్లా మెజిస్ట్రేట్ అనుజు కుమార్ జా పాల్గొన్నారు.

మసీదు నిర్మాణానికి ట్రస్టు ఏదీ : పవార్
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ట్రస్టు ఏర్పాటు జరిగిందీ కానీ అక్కడ మసీదు నిర్మాణానికి ఏర్పాట్లు ఎందుకు జరగడం లేదని ఎన్‌సిపి నేత శరద్ పవార్ ప్రశ్నించారు. మసీదు కోసం ట్రస్టు అవసరం లేదా? అని నిలదీశారు. ఈ దేశం అందరిదీ కదా, ఆలయ నిర్మాణానికి వేగిరపాటు పడుతున్నారు కానీ మసీదు కోసం కనీసం చిన్న అడుగు ముందుకు వేయరా? అని నిరసన వ్యక్తం చేశారు.

Construction of the Ramalaya in Ayodhya
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News