Monday, April 29, 2024

లాక్‌డౌన్‌తో భారత్‌లో కరోనా కట్టడి సాధ్యమైంది

- Advertisement -
- Advertisement -

Corona control was possible in India with the lockdown

 

మన తెలంగాణ/హైదరాబాద్ : భారతదేశం కరోనాపై పోరులో విజయవంతమైందని చెప్పేందుకు… అందుకు సంబంధించిన అంశాలతో కూడిన ఓ నివేదికను కేంద్రం బయటపెట్టింది.

దేశంలో లాక్‌డౌన్‌ను దాదాపు సడలింపులతో కేంద్రం ఎత్తేసినట్లేనని, ఇన్నాళ్లు కేంద్రం విధించిన లాక్‌డౌన్ వల్ల ఒరిగే ప్రయోజనం ఏమిటి.. లాభమా? నష్టమా? ప్రపంచవ్యాప్త మహమ్మారి విస్తృతితో పోలిస్తే భారత్‌లో తగ్గిందా? పెరిగిందా? విదేశాలకు భారత్‌కు మధ్య తేడా ఏమిటి? ఇత్యాది అంశాలపై ఆ నివేదికలో సవివరంగా పేర్కొన్నారు. 50 రోజుల లాక్‌డౌన్ వైరస్ వ్యాప్తి వేగాన్ని తగ్గించడంలో సహాయపడింది.

మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి, తిరిగి పునరుత్తేజం కావడానికి వైరస్‌కు వ్యతిరేకంగా నిజమైన పోరాటానికి సిద్ధం చేయడానికి ప్రభుత్వానికి ఈ లాక్‌డౌన్ చాలా కీలకమని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ మేరకు కేంద్ర మెడికల్ ఎడ్యుకేషన్ డ్రగ్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన గణాంకాల ద్వారా మహమ్మారి విషయంలో భారత్.. మిగతా దేశాల కంటే ఎంత మెరుగైన పనితీరును కనబర్చిందో స్పష్టమవుతుంది. లాక్‌డౌన్ వల్లనే దేశంలో కేసులు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి.

భారత్‌లో కరోనా కేసులు మొదలయ్యాక డబుల్ అయ్యింది. ఏప్రిల్ తొలివారం నుంచే భారీగా పెరగడం మొదలైంది. ఏప్రిల్ రెండో వారం నుంచి కేసుల సంఖ్య డబుల్ కావడంతో పాటు అమాంతంగా పెరిగినట్లు గ్రాఫ్ సూచిస్తోంది. ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా 46.18 లక్షల కేసులు నమోదయ్యాయి. అదే భారత్‌లో 101139 కేసులున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ పుట్టినప్పటి నుంచి విస్తరించిన వరకు సగటు విస్తరణ చూస్తే కేసుల పెరుగుదల 6.75 శాతం పెరగగా.. భారత్‌లో మాత్రం 3.13 శాతం మాత్రమే పెరిగింది.

మరణాల రేటు కూడా తక్కువగా ఉందని కేంద్రం వెల్లడించింది. కరోనా వ్యప్తిని భారత్ లాక్‌డౌన్‌తో చాలా వరకు కట్టడి చేసింది. మొదటి 25000 పాజిటివ్ కేసుల మార్క్ దాటానికి భారత్‌లో 86 రోజులు పట్టింది. 25000 నుంచి 50000 కేసులను చేరుకోవడానికి 11 రోజలు పట్టింది. 75000 చేరుకోవడానికి మరో 7 రోజులు పట్టింది. ప్రస్తుతం లక్ష మార్కును చేరుకోవడానికి కేవలం ఐదు రోజులు పట్టడం గమనార్హం.

అయితే పాజిటివ్ కేసుల వృద్ధి రేటు 7.6 నుంచి 7.0కి, తర్వాత 5.7 శాతం నుంచి 5.1 శాతానికి పడిపోయింది. లాక్‌డౌన్ కారణగా దీని తీవ్రత తగ్గిందని కేంద్ర నివేదిక చెబుతోంది. కేసుల సంఖ్య రెట్టింపు కావడానకి తీసుకున్న సమయం దేశంలో 12 రోజులకు పెరిగింది. దేశంలోనే అత్యంత తీవ్రత ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడులో ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ వైరస్ వ్యాప్తి నుంచి తూర్పు ఈశాన్య రాష్ట్రాలను.. ముఖ్యంగా అత్యధిక జనాభా కలిగిన యూపీ, బీహార్, జార్ఖండ్‌లను ఈ మహమ్మారి వ్యాప్తి నుంచి భారత్ రక్షించగలిగింది. ప్రస్తుతం దేశంలో కేవలం నాలుగు రాష్ట్రాలలో పరిస్థితి భయానకంగా ఉంది.

మహారాష్ట్రలో 39 శాతం కేసులు, తమిళనాడులో 13.7 శాతం కేసులు, గుజరాత్‌లో 11 శాతం కేసులు, ఢిల్లీలో 10.4శాతం కేసులు ఉన్నాయి. భారతదేశంలో లక్ష మార్కును చేరుకోవడానికి 109 రోజులు పట్టింది. ఈ విధంగా భారతదేశంలో రోజులతో పోలిస్తే మహమ్మారి విస్తృతిలో మన సగటు కేవలం 6 శాతం మాత్రమే ఉండగా ప్రపంచ సగటు 60 శాతంగా ఉంది. నిజానికి ప్రపంచ సగటుతో కనుక భారత్‌లో వైరస్ విస్తరిస్తే మే నాటికి 33 కోట్ల కరోనా పాజిటివ్ కేసులు దేశంలో నమోదై ఉండేవి. దీంతో దేశంలో హాహాకారాలు.. అల్లకల్లోలం.. కోట్ల మంది ప్రాణాలకు ముప్పు వాటిల్లేది. కానీ నిజంగా మోదీ సర్కార్ సకాలంలో విధించిన లాక్‌డౌన్ సహాయపడిందనే పేర్కొనవచ్చు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News