Monday, April 29, 2024

కొత్తగా 12,591 మందికి కరోనా.. 65 వేలు దాటిన యాక్టివ్ కేసులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : తగ్గుముఖం పట్టిందనుకున్న కరోనా మహమ్మారి మళ్లీ చెలరేగుతోంది. గత కొన్ని రోజులుగా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. మరణాలు కూడా పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో 12,591 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఒక్క రోజే 40 మంది మరణించారు. వీరిలో 11 మరణాలు కేరళ నుంచే నమోదయ్యాయి.

గత ఎనిమిది నెలల్లో ఒకే రోజు ఇంత భారీగా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. బుధవారం 10,542 కేసులు నమోదు కాగా, ఇప్పుడు 20 శాతం వరకు అధికంగా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 65,286 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేసులు పెరగడానికి ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ఎక్స్‌బీబీ .1.16 కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకు 4.48 కోట్ల మంది వైరస్ బారిన పడగా, వీరిలో 4,42,61,476 మంది కోలుకున్నారు.

పాజిటివిటీ రేటు 5.32 శాతం కాగా, రికవరీ రేటు 98.67 శాతంగా ఉంది. యాక్టివ్ కేసుల శాతం 0.15 గా ఉంది. కొత్తగా 29 మంది మరణించడంతో మృతుల సంఖ్య 5,31,230 కి చేరింది. దేశ వ్యాప్తంగా మొత్తం 220.66 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News