Saturday, April 27, 2024

కరోనా ఎఫెక్ట్… ముందస్తు చర్యలు తీసుకుంటున్న ఆర్టిసి

- Advertisement -
- Advertisement -

CoVID 19

 

హైదరాబాద్ : ఆర్టిసిలో ప్రయాణించే ప్రయాణికులకు కరోనా సంబంధిత వైరస్‌లు సోకకుండా అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగా అధికారులు ఇప్పటికే బస్టేషన్లు, బస్సులతో పాటు టాయిలెటన్లు కూడా వదలకుండా ప్రతిఒక్క ప్రాంతంలో వైరస్ నిరోధక చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యమంగా రంగారెడ్డి రీజియన్ పరిధిలోని అన్ని బస్సులకు కరోన వైరస్ బ్యాక్టీరియా సోకుండా కెమికల్, ఆల్కహల్‌బేస్డ్ ల్విడ్‌తో బస్సులోపల, బయట ( ప్రయాణికులు ఉపయోగించే డోర్ హ్యాండిల్, ఆర్మ్ రెస్ట్ ఇన్సైడ్, బస్సు ఫ్లోర్) వంటి వాటిని కార్మికులతో పరిశుభ్రంగా చేస్తున్నట్లు రీజనల్ వరప్రసాద్ తెలిపారు. అంతే కాకుండా బస్టేషన్‌లోని కుర్చీలు, టేబుళ్ళను శుభ్రపరుస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులు ఎటువంటి అపోహాలకు గురికావద్దని ఆర్టిసి బస్సుల్లోనే ప్రయాణించడం సురక్షితం, సుఖమయమన్నారు. ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా తాము పని చేస్తున్నామని, ఇక ముందు కూడా ఇటువంటి చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.

CoVID 19 Control in TSRTC
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News