Monday, April 29, 2024

సివిల్స్‌లో సిసాట్ రద్దు లేదు: కేంద్రం

- Advertisement -
- Advertisement -

CSAT not to be dropped for Civil Services Exam

న్యూఢిల్లీ : సివిల్ సర్వీసెస్ ఎక్జామినేషన్ నుంచి సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (సిసాట్)ను మినహాయించే ఆలోచన లేదని కేంద్రం తెలిపింది. రాజ్యసభలో గురువారం సభ్యుల ప్రశ్నకు ప్రభుత్వం దీనిపై వివరణ ఇచ్చింది. ఉన్నత ప్రభుత్వ సర్వీసుల్లో ప్రవేశానికి సంబంధించిన సివిల్ సర్వీసెస్ పరీక్షలను కేంద్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (యుపిఎస్‌సి) నిర్వహిస్తూ వస్తోంది. మూడు దశలలో ఈ పరీక్షలు ఉంటాయి. ప్రిలిమినరీ, మెయిన్, తరువాతి దశలలో ఇంటర్యూలు ఉంటాయి. ఈ ప్రక్రియల ద్వారా ఐఎఎస్ , ఐపిఎస్, ఐఎఫ్‌ఎస్ వంటి కీలక స్థాయి అధికారుల ఎంపిక జరుగుతుంది. ఇప్పటివరకూ సిసాట్ ఈ పరీక్షల ప్రిలిమినరీ ఘట్టంలో భాగంగా ఉంది. దీనిని ఎత్తివేయాలనుకుంటున్నారా? అనే ప్రశ్నకు పర్సనల్ వ్యవహారాల మంత్రి జితేంద్ర సింగ్ లేదు సార్, అటువంటిదేమీ లేదని సమాధానం ఇచ్చారు. సివిల్ సర్వీసెస్ పరీక్షల ప్రస్తుత విధానాన్ని మార్చే ఆలోచన ఏదీ లేదని కూడా స్పష్టం చేశారు. ఇంటర్వూల బదులు సైకాలాజికల్ టెస్టులు నిర్వహించే అవకాశాలు ఏమీ లేవన్నారు.

CSAT not to be dropped for Civil Services Exam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News