Friday, May 17, 2024

కావేరీపై సిడబ్లుఆర్‌సి ఉత్తర్వులను సుప్రీంలో సవాలు చేస్తాం: సిద్దరామయ్య

- Advertisement -
- Advertisement -

చామరాజనగర్: తమిళనాడుకు నీరు విడుదల చేయాలంటూ కావేరీ జలవ నియంత్రణ కమిటీ(సిడబ్లుఆర్‌సి) జారీచేసిన ఉత్తర్వును సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య బుధవారం ప్రకటించారు.

సిడబ్లుఆర్‌సి త్తర్వులను సవాలు చేయడంతోపాటు అప్పీలు పిటిషన్ కూడా దాఖలు చేస్తామని మాలై మహదేశ్వర హిల్స్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి తెలిపారు. కాగా..తమిళనాడుకు నీటి విడుదలపై వెలువడిన ఉత్తర్వులకు నిరసనగా బెంగళూరుతోపాటు కావేరీ నది పరీవాహక ప్రాంతాలలో నిరసన ప్రదర్శనలు సాగుతున్నాయి.

కర్నాటకకు ప్రస్తుతం నీటి కొరత లేదని, న్యాయ నిపుణుల అభిప్రాయాలు తీసుకున్నామని ఆయన చెప్పారు. కావేదీ జలాల విషయం రాజీపడే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. కావేరీ సంక్షోభంపై బిజెపి, జెడిఎస్ రాజకీయాలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News