Monday, April 29, 2024

తుపాను బలహీనపడినా.. గుజరాత్‌లో భారీ వర్షాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గుజరాత్ కు బిపర్ జాయ్ తుపాను ముప్పు ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. బిపర్ జాయ్ కచ్, పాక్ పైపు దిశ మార్చుకుంది. సాయంత్రం జఖౌ దగ్గర తుపాను తీరం దాటనుంది. తీరం దాటే సమయంతో ఈదురుగాలులతో కూడా భారీ వర్షాలు పడనున్నాయని అధికారులు వెల్లడించారు. తుపాను బలహీనపడినా గుజరాత్ లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. సముద్రతీరంలో అలలు ఎగసిపడుతున్నాయి.

దీంతో కేంద్రం సహాయక చర్యలు ముమ్మరం చేసింది. 75 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గుజరాత్ సహా 8 రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని సమాచారం. కేరళ, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గోవా, లక్షద్వాప్ లో వర్షాలు దంచికొట్టనున్నాయి. ఎన్ డిఆర్ఎఫ్, ఎస్ డిఆర్ఎఫ్ బలగాలు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News