Monday, April 29, 2024

తొలి రోజు.. జనాలు పోటెత్తలేదు

- Advertisement -
- Advertisement -

రూ.2000 నోట్ల మార్పిడి కోసం బ్యాంకుల్లో రద్దీ సాధారణమే

మన తెలంగాణ/ హైదరాబాద్ : ఏడేళ్ల క్రితం నాటి నోట్ల రద్దు పరిస్థితులు, తాజాగా రిజర్వు బ్యాంక్ ఉపసంహరించుకున్న రూ.2000 నోట్ల మార్పిడి విషయంలో కనిపించలేదు. తొలి రోజు బ్యాంకుల వద్ద కస్టమర్ల క్యూ లైన్లు సాధారణంగానే ఉన్నాయి. బ్యాంకుల్లో ఎలాంటి రద్దీ అంతంత మాత్రంగానే ఉంది. హైదరాబాద్‌తో పాటు ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో బ్యాంక్ బ్రాంచ్‌ల వద్ద డిపాజిట్, మార్పిడి చేసుకునేందుకు ప్రజల సంఖ్య స్వల్పంగానే ఉంది. బ్యాంకు సమయం ముగిసే వరకు ఒక్క రూ.2 వేల నోటు కూడా డిపాజిట్ చేయలేదని కొన్ని బ్యాంకులు వెల్లడించాయి.

రూ.2 వేల నోట్లను డిపాజిట్ చేసేందుకు ఆర్‌బిఐ సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది. దీంతో ఇంకా నాలుగు నెలల సమయం ఉండడం వల్ల ప్రజల్లో ఎలాంటి ఆందోళన గానీ, ఆతృతగానీ కనిపించలేదు. దేశంలోని ఏ బ్యాంకు వద్ద చూసిన సాధారణంగా కస్టమర్ల రద్దీ కనిపించింది. నోట్ల మార్పిడి కోసం పెద్ద ఎత్తున జనాలు ఏమీ రాలేదు. 2016లో నోట్ల రద్దు సమయంలో బ్యాంకుల వద్ద కిలో మీటర్ల మేర పెద్ద క్యూలు కనిపించగా, ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు గడువు సమయం కూడా చాలా ఎక్కువగా ఉండడంతో అలాంటి పరిస్థితులు ఏమీ కనిపించడం లేదు.

పాన్ కార్డు, ఫామ్‌లపై గందరగోళం
రూ.2 వేల నోట్ల డిపాజిట్ల విషయంలో బ్యాంకుల్లో పాన్ లేదా ఆధార్ కార్డు, అధికారిక ఫామ్‌లు పూరించడం వంటి అంశాలపై గందరగోళ పరిస్థితి నెలకొంది. మొదటి రోజుల బ్యాంకుల్లో నోట్లను మార్పిడి చేసేందుకు వచ్చిన కస్టమర్లను బ్యాంక్ సిబ్బంది ఐడి కార్డులను ఇవ్వాలని కోరినట్టు కొన్ని ప్రాంతాల నుంచి ఫిర్యాదు అందాయి. బ్యాంకుల్లో సమన్వయం కొరవడిందని, కొన్ని బ్యాంకుల్లో నిబంధనలు చెప్పడం, కొన్ని బ్యాంకుల్లో ఎలాంటి గుర్తింపు కార్డులు లేకుండా డిపాజిట్ చేయడం వంటివి కనిపించాయని మీడియా వర్గాలు పేర్కొన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News