Monday, April 29, 2024

ఢిల్లీ-లండన్ విమానంలో చీమల దండు

- Advertisement -
- Advertisement -

Delhi-London Air India flight delayed after ants found in business class

 

చీమల దండు, 3 గంటలకుపైగా ఆలస్యంగా టేకాఫ్

న్యూఢిల్లీ: సోమవారం ఢిల్లీ నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం మూడు గంటలకుపైగా ఆలస్యమైంది. టేకాఫ్‌కు కొన్ని నిమిషాల ముందు విమానంలోని బిజినెస్ క్లాస్‌లో చీమల దండును గమనించిన సిబ్బంది దానిని నిలిపివేశారు. షెడ్యూల్ ప్రకారం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సాయంత్రం 2 గంటలకు బయలుదేరాల్సిన విమానం 520కి టేకాఫైంది. విమానాన్ని మార్చి బోయింగ్ 7878 ఎయిర్‌క్రాఫ్ట్ ద్వారా ప్రయాణికుల్ని తరలించారు. ఇలాంటి సంఘటనే ఢిల్లీ విమానాశ్రయంలో ఈ ఏడాది మే 27న జరగడం గమనార్హం. ఆరోజు న్యూయార్క్‌కు వెళ్లాల్సిన విమానంలో టేకాఫైన కొద్దిసేపటికి విమానంలో గబ్బిలాన్ని గమనించిన సిబ్బంది దానిని పైలట్‌కు చెప్పడంతో వెనక్కి మళ్లించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News