Monday, April 29, 2024

నౌకల నుంచి మోడెర్నా వ్యాక్సిన్ అమెరికాకు డెలివరీ

- Advertisement -
- Advertisement -

Delivery of Moderna Vaccine to America from Ships

 

ఆలివ్ బ్రాంచ్ : అమెరికాలో అత్యవసర వినియోగానికి అనుమతి పొందిన రెండో టీకా మోడెర్నా వ్యాక్సిన్ ను నౌకల నుంచి ప్యాకేజిల ద్వారా డెలివరీ చేయడం ప్రారంభించారు. మోడెర్నా వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే మెంఫిస్ ఏరియా ఫ్యాక్టరీ నుంచి సిబ్బంది బాక్సుల్లో వ్యాక్సిన్‌ను నౌకల్లో లోడు చేశారు. నౌకల నుంచి ఆ వ్యాక్సిన్‌ను ఇప్పుడు కిందకు దించుతున్నారు. సోమవారం నుంచి ఈ వ్యాక్సిన్‌ను ప్రజలకు అందచేస్తారు. మోడెర్నా ఫైజర్ టీకాల డోసులు ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి అన్న దానిపై నిపుణుల కమిటీ చర్చిస్తుంది. వారం రోజుల క్రితమే ఫైజర్ వ్యాక్సిన్ అమెరికాకు చేరింది. ఇమ్యునైజేషన్ ప్రాక్టీసెస్ సలహా కమిటీ సూచనల ప్రకారం హెల్త్ కేర్ వర్కర్లకు, కేర్‌హోమ్స్ నివాసులకు, సిబ్బందికి, మొదట టీకా ఇస్తారు.

మరికొన్ని వారాల వరకు వీరికే మొదట టీకాలు ఇస్తారు. అయితే సాధారణ ప్రజలకు ఇప్పటికిప్పుడే టీకా అందక పోవచ్చు. మరికొన్ని నెలలు వారు వేచి ఉండాలి. బస్సుడ్రైవర్లు, గ్రాసరీ స్టోర్ క్లర్కులు, తదితరులకు తరువాత టీకా ఇవ్వాలని ప్యానెల్ కమిటీ సభ్యులు మొగ్గు కూపుతుండగా, నిపుణులు మాత్రం 65 ఏళ్లు , ఆపై వృద్ధులకు టీకా ఇవ్వడం మంచిదని అభిప్రాయ పడుతున్నారు. మోడెర్నా, ఫైజర్ వ్యాక్సిన్లు రెండిటికీ రెండేసి డోసుల వంతున కొన్ని వారాల వ్యవధిలో ఒక్కొక్కరికి ఇవ్వాల్సి ఉంటుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News