Monday, April 29, 2024

మరియమ్మ కుటింబీకులను పరామర్శించిన డిజిపి

- Advertisement -
- Advertisement -

DGP Mahender reddy who consoles Mariamma family

 

పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తామని హామీ

మనతెలంగాణ/హైదరాబాద్ :లాకప్‌డెత్‌కు గురైన మరియమ్మ కుటుంబాన్ని ఆదివారం నాడు పరామర్శించిన రాష్ట్ర డిజిపి మహేందర్‌రెడ్డి. ఇటీవల ఆత్మహత్యకు యత్నించి ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరియమ్మ కుమారుడిని కలిశారు. ఈక్రమంలో మరియమ్మ కుమారుడి ఆరోగ్యంపై వైద్యులను ఆరా తీశారు. అదేవిధంగా మృతురాలు మరియమ్మ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. లాకప్ డెత్‌కు గురైన మరియమ్మకు న్యాయం జరిగేలా చూస్తామని డిజిపి స్పష్టం చేశారు. మరియమ్మ మరణానికి కారణమైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్బంగా డిజిపి మాట్లాడుతూ.. యాదాద్రి జిల్లా అడ్డగూడూరులో లాకప్ డెత్ లో చనిపోయిన మరియమ్మ సంఘటన దురదృష్టకరమన్నారు.

ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరుగుతుందని, బాధ్యులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికే బాధిత కుటుంబానికి తగిన సాయాన్ని ప్రకటించిందని, సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ తో ప్రజలకు దగ్గరవుతున్న సమయంలో మరియమ్మ ఘటన జరగడం దురదుష్టకరమని డిజిపి చెప్పారు. మరియమ్మ మృతిపట్ల విచారం వ్యక్తం చేస్తున్నామని, ప్రజల ఆత్మగౌరవం, ప్రాణాలకు భంగం కలగకుండా నడుచుకుంటాం. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటివి జరగక్కుండా చూస్తామని డిజిపి వివరించారు. నేరాలను నిరోధించే క్రమంలో ప్రజల ఆత్మగౌరవం దెబ్బ తీయకుండా పోలీసులు విచారణ జరపాలని డిజిపి పేర్కొన్నారు.

మరియమ్మ మృతిపై విచారణ 

దళిత మహిళ మరియమ్మ లాకప్‌డెత్‌పై ప్రత్యేక పోలీసు బృందం విచారణ చేపడుతోందని డిజిపి వివరించారు. దళిత మహిళ మరియమ్మ మృతిచెందడం బాధాకారమని, ఈ కేసులో ఇప్పటికే నలుగు పోలీసు అధికారులపై వేటు పడిందన్నారు. కాగా మరియమ్మ లాకప్‌డెత్‌పై విపక్షాలు, ప్రజాసంఘాల ఆందోళనతో బాధిత కుటుంబానికి న్యాయం జరిగే దిశగా అడుగులు పడుతున్నాయి. కాంగ్రెస్ బృందం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన సిఎం కెసిఆర్ దళితులపై చేయిపడితే ఊరుకునేది లేదని స్పష్టంచేశారు. బాధిత కుటుంబానికి పరిహారం ప్రకటించిన సీఎం లాకప్‌డెత్ పూర్వాపరాలు తెలుసుకోవాలని డిజిపిని ఆదేశించారు. దీంతో ఆయన ఆదివారం నాడు ఖమ్మంలో పర్యటించారు. ఇదిలావుండగా ఎస్‌ఐ మహేశ్, కానిస్టేబుళ్లు రషీద్, జానయ్యపై సస్పెండ్ చేసిన రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తాజాగా చౌటుప్పల్ ఎసిపిని కమిషనరేట్‌కు అటాచ్ చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News