Sunday, April 28, 2024

అల్లు అర్జున్ ‘ఐకాన్’పై దిల్ రాజు క్లారిటీ

- Advertisement -
- Advertisement -

Dil Raju gives clarity on 'ICON' Movie

హైదరాబాద్: అల్లు అర్జున్, డైరెక్టర్ శ్రీరామ్ వేణు కాంబినేషన్ లో ‘ఐకాన్’ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రకటించిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పుష్ప’ సినిమాతో బిజీ కావడం, మరోవైపు శ్రీరామ్ వేణు ‘వకీల్ సాబ్’ మూవీపై ఫోకస్ పెట్టడంతో ఈ సినిమా వాయిదా పడింది. అయితే ‘వకీల్ సాబ్’ విడుదల కావడం.. ‘పుష్ప’ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో శ్రీరామ్ వేణు బన్నీతో ‘ఐకాన్’ చిత్రాన్ని మెదలుపెట్టనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ చిత్రంపై దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. ‘వకీల్ సాబ్’ విడుదలై ఘన విజయం సాధించిన నేపథ్యంలో దిల్ రాజు శనివారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ‘ఐకాన్’ చిత్రంపై విలేకర్లు అడిగిన ప్రశ్నలకు దిల్ రాజు సమాధానం ఇస్తూ.. ”మా బ్యానర్ లో తెరకెక్కబోయే తదుపరి సినిమా ఐకాన్. ఈ మూవీ స్క్రిప్ట్ రెడీగా ఉంది. కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఈ సినిమా కథా నాకు బాగా నచ్చింది. త్వరలోనే వేణు దర్వకత్వంలో ఈ మూవీ ప్రారంభమవుతుంది” అని చెప్పారు.

Dil Raju gives clarity on ‘ICON’ Movie

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News