Saturday, April 27, 2024

అప్పట్లో వారు ఆశ్చర్య పోయారు

- Advertisement -
- Advertisement -

Dilip Vengsarkar says about Sachin Tendulkar

 

ముంబై: మాస్టర్ సచిన్ టెండూల్కర్ కెరీర్ ఆరంభానికి ముందుకు సంబంధించిన ఓ ఆసక్తికర సంఘటనను టీమిండియా మాజీ కెప్టెన్ దిలిప్ వెంగ్‌సర్కార్ అభిమానులతో పంచుకున్నాడు. సచిన్ 15 ఏళ్ల వయసున్నప్పుడూ అప్పటి బాంబే క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ వాసుదేవ్ పరాంజే ఓ ప్రతిపాదనతో తన ముందుకు వచ్చాడన్నాడు. అప్పుడూ తాను టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నానని వెంగ్‌సర్కార్ వివరించాడు. న్యూజిలాండ్‌తో జరిగే టెస్టు మ్యాచ్ కోసం తాము అప్పుడూ ముంబైకి వచ్చామన్నాడు. ఆ సమయంలో పరాంజే తన వద్దకు సచిన్‌ను తీసుకొచ్చాడన్నాడు. కొద్ది సేపు అతని బ్యాటింగ్‌ను తిలకించాలని తనను కోరాడన్నాడు. అయితే అప్పుడూ సచిన్‌ను చూసిన తాను తర్వాత చూస్తానులే అతన్ని పంపించేయమని పరాంజే కోరాను. అయితే పరాంజే మాత్రం దానికి ఒప్పుకోలేదు. ఇతనిలో అపార ప్రతిభ దాగివుందని, స్కూల్ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తున్నాడని వివరించాడు.

నెట్స్‌లో అతను చూస్తున్న బ్యాటింగ్‌ను ఒకసారి చూడాలని మరోసారి విజ్ఞప్తి చేశాడు. దీంతో పరాంజే విజ్ఞప్తిని తాను కాదనలేక పోయానన్నాడు. ఇక అదే సమయంలో స్టేడియంలో సాధన చేస్తున్న కపిల్‌దేవ్, చేతన్ శర్మ, అర్షద్ అయూబ్, మణీందర్ సింగ్ తదితరులను పిలిచి నెట్స్‌లో సచిన్‌కు బ్యాటింగ్ చేయాలని కోరానన్నాడు. అప్పుడూ వారందరూ నావైపు చాలా ఆశ్చర్యకరంగా చూశారన్నాడు. తామెంటీ, 15 ఏళ్ల కుర్రాడికి బౌలింగ్ చేయడం ఏంటని వారు ప్రశ్నించారని వెంగ్‌సర్కార్ పేర్కొన్నాడు. అయితే తాను ఒత్తిడి చేయడంతో వారంతా సచిన్‌కు బౌలింగ్ చేశారన్నాడు. అయితే నెట్స్‌లో సచిన్ కొట్టిన షాట్లను చూసిన వారంత దానికి ఫిదా అయిపోయారన్నాడు. ఆరంభంలో బౌలింగ్ చేసేందుకు ఏమాత్రం ఇష్టపడని భారత స్టార్ బౌలర్లందరూ సచిన్ ఏకధాటిగా బంతులు విసిరిన విషయాన్ని వెంగ్‌సర్కార్ గుర్తు చేశాడు. అదే రోజు సాయంత్రం సచిన్‌ను బాంబే జట్టుకు ఎంపిక చేశారన్నాడు. ఆ తర్వాత సచిన్ మళ్లీ వెనుదిరిగి చూడలేదన్నాడు. ఓ ఇన్‌స్టా లైవ్ కార్యక్రమంలో పాల్గొన్న వెంగ్‌సర్కార్ ఈ విషయం వెల్లడించాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News