Monday, April 29, 2024

రష్యాలో కరోనా టీకా స్పుత్నిక్-‌వి పంపిణీ

- Advertisement -
- Advertisement -

Distribution of corona vaccine Sputnik V in ​​Russia

 

మాస్కో: కరోనా కట్టడికి రష్యాలో అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌వి టీకాను తమ పౌరులకు అందుబాటులోకి తెచ్చినట్టు ఆ దేశ ఆరోగ్యశాఖ ప్రకటించింది. రష్యాలోని అన్ని ప్రాంతాలకు ఈ వ్యాక్సిన్ మొదటి బ్యాచ్‌ను చేరవేశామని, పౌరులు టీకాలు తీసుకుంటున్నారని తెలిపింది. రష్యన్ డైరెక్ట్ ఇన్‌వెస్ట్‌మెంట్ ఫండ్(ఆర్‌డిఐఎఫ్) సహకారంతో గమలేయా సైంటిఫిక్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఈ వ్యాక్సిన్‌ను తయారు చేసింది. ఆగస్టు 11న ఈ వ్యాక్సిన్ పంపిణీకి అనుమతి ఇస్తున్నట్టు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. దాంతో, ప్రపంచం దృష్టి రష్యావైపు మళ్లింది. దాదాపు 20 దేశాలు ఈ వ్యాక్సిన్ పట్ల ఆసక్తి చూపాయి. ఇప్పటి వరకు ఆయా దేశాల నుంచి 100 కోట్ల డోసులకు విజ్ఞప్తులు వచ్చాయని ఆర్‌డిఐఎఫ్ తెలిపింది.

ఈ ఏడాది చివరినాటికి 20 కోట్ల డోసులు సిద్ధం చేయనున్నట్టు తెలిపింది. 3 కోట్ల డోసుల్ని రష్యాలో, మిగతా డోసుల్ని దక్షిణ కొరియా, బ్రెజిల్, సౌదీ అరేబియా, టర్కీ, క్యూబాతోపాటు భారత్‌లోనూ తయారు చేయనున్నట్టు తెలిపింది. హైదరాబాద్‌లోని డాక్టర్ రెడ్డీస్ లేబరేటరీస్‌తో రష్యా సంస్థ ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. రష్యా వ్యాక్సిన్ పట్ల ప్రపంచ ఆరోగ్యసంస్థ(డబ్లూ హెచ్‌ఒ) యూరప్ ప్రాంతీయ డైరెక్టర్ హాన్స్‌క్లుగే విశ్వాసం ప్రకటించారు. వ్యాక్సిన్ల తయారీలో రష్యాకు ఎంతో చరిత్ర ఉన్నదని ఆయన అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News