Friday, May 17, 2024

అలిపిరి మెట్ల మార్గంలోనే దివ్యదర్శనం టోకెన్లు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు నడక ద్వారా వెళ్ళు భక్తులకు మాత్రమే దివ్యదర్శనం టోకెన్లు అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌లో జారీ చేస్తారని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. దివ్యదర్శనం టోకెను తీసుకున్న భక్తులు, ఆ దర్శన టోకెన్లును అలిపిరి మెట్ల మార్గం నందు గల గాలి గోపురం (స్టెప్ నెం. 2083) వద్ద తప్పనిసరిగా స్కానింగ్ చేయించుకోవాలి. లేని యెడల స్వామి వారి దర్శనంకు అనుమతించరని తెలిపారు. దివ్యదర్శనం టోకెన్స్ తీసుకున్న భక్తులు తప్పనిసరిగా అలిపిరి మెట్ల మార్గం ద్వారా మాత్రమే తిరుమలకు చేరుకోవాలి.

Also Read: బెజవాడ దుర్గమ్మకు అగ్గిపెట్టెలో బంగారు చీర…

అలాకాకుండా, మరే మార్గంలో తిరుమలకు వెళ్లినా దివ్యదర్శనం టిక్కెట్ పనిచేయదని టిటిడి తెలిపింది. వాహనాల్లో తిరుమలకు చేరుకునేవారు.. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో శ్రీనివాసం, విష్ణునివాసం (రైల్వేస్టేషన్), గోవిందరాజ సత్రాల (తిరుపతి రైల్వేస్టేషన్ వెనుక) వద్ద స్వామి దర్శనం కోసం ఎస్.ఎస్.డి టోకెన్స్ జారీ చేస్తారని దేవస్థానం అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News