Monday, April 29, 2024

లాభాల స్వీకరణతో మార్కెట్లు పతనం

- Advertisement -
- Advertisement -

ముంబై : లాభాల స్వీకరణ కారణంగా దేశీయ స్టాక్‌మారెట్లు మళ్లీ నష్టపోయాయి. బ్యాంకింగ్, ఐటీ స్టాక్స్‌లో ప్రాఫిట్ బుకింగ్ ఎక్కువగా కనిపించింది. దీంతో మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 107 పాయింట్ల నష్టంతో 66,160 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 14 పాయింట్ల నష్టంతో 19,646 పాయింట్ల వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో బ్యాంకింగ్, ఆటో, ఐటీ రంగాల షేర్లు లాభాల్లో ముగిశాయి. ఫార్మా, మెటల్స్, ఎనర్జీ, ఎఫ్‌ఎంసిజి, మీడియా, రియల్ ఎస్టేట్, హెల్త్‌కేర్, ఆయిల్, గ్యాస్ రంగాల షేర్లలో కొనుగోళ్లు కనిపించాయి. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 16 లాభాలతో, 14 నష్టాలతో ముగిశాయి. బిఎస్‌ఇలో లిస్టయిన కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.304.07 లక్షల కోట్లకు పెరిగింది. ఇది గురువారం సెషన్‌లో రూ.303.59 లక్షల కోట్లుగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News